E-Paper
Advertisement

AOR Pre release: ఆ ఇద్దరు హీరోయిన్లతో చేయడం నా డ్రీమ్ : నవీన్ పోలిశెట్టి

AOR Pre release: ఆ ఇద్దరు హీరోయిన్లతో చేయడం నా డ్రీమ్ : నవీన్ పోలిశెట్టి
Advertisement

AOR Pre Release: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇక్కడ సక్సెస్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. అలా ఇండస్ట్రీలో పలుకుబడి లేకపోయిన సక్సెస్ అందుకున్న వారిలో చిరంజీవి ఒకరు. ఆయనని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అందుకున్నారు. చిరంజీవి గారిని తన గురువుగా భావించి సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అందుకున్న వారిలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఒకరు. స్టాండప్ కమెడియన్ గా మొదలైన ఆయన ప్రయాణం నేడు స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు.

సంక్రాంతి బరిలో నవీన్ పోలిశెట్టి..

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న నవీన్ పోలీస్ శెట్టి ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈయన జనవరి 14వ తేదీ అనగనగా ఒక రాజు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమా గురించి తన కెరియర్ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఎప్పటిలాగే తన సినిమాలను ప్రోత్సహిస్తున్నటువంటి అభిమానులు ఈసారి కూడా తన సినిమాను విజయవంతం చేయాలని కోరుకున్నారు.

ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేదు..

Advertisement

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన అభిమానులను ఉద్దేశించేంత గొప్పగా మాట్లాడారు. నాకు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా నా బ్యాక్ గ్రౌండ్ లో చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఇలా సినిమా గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్న నవీన్ పోలిశెట్టి తన టీం ప్రాజెక్టు గురించి కూడా తెలిపారు. ఇద్దరు హీరోయిన్లను డిస్ ప్లే చేస్తూ ఇద్దరిలో ఎవరితో నీకు నటించాలని ఉంది అంటూ సుమా అడగడంతో ఆయన తనదైన శైలిలోనూ సమాధానాలు చెప్పారు. అయితే చివరికి అనుష్క శెట్టి (Anushka Shetty),మీనాక్షి చౌదరి ఇద్దరి ఫోటోలు రావడంతో నవీన్ పోలిశెట్టి సమాధానం చెబుతూ నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ లేదా రైటర్స్ ఎవరైనా ఉంటే మా ముగ్గురి కాంబినేషన్లో ఒక సినిమా స్టోరీ రాయాలని సమాధానం చెబుతూ అందరిని ఆశ్చర్యపరిచారు.

అనుష్కతో మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి..

Advertisement

మీనాక్షి చౌదరి అనుష్క ఇద్దరితో కలిసి నటించడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, కచ్చితంగా ఈ డ్రీం ప్రాజెక్టు నెరవేరాలి అంటూ ఈయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఇదివరకే అనుష్క శెట్టితో కలిసి నవీన్ పోలిశెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మీనాక్షి చౌదరితో అనగనగా ఒక రాజు అనే సినిమా ద్వారా రాబోతున్నారు. ఇక వీరిద్దరితో కలిసి నటించాలని ఉందని ఈయన తెలిపారు. మరి నవీన్ పోలిశెట్టి డ్రీం ప్రాజెక్టు నెరవేరుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: AOR Pre release: మహేష్ బాబు హ్యాండ్సమ్… హీరోలపై మీనాక్షి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×