E-Paper
Advertisement

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి షాకింగ్ డెసిషన్.. సినిమాలు గ్యాప్‌కి అదే కారణమా?

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి షాకింగ్ డెసిషన్.. సినిమాలు గ్యాప్‌కి అదే కారణమా?
Advertisement

Naveen Polishetty: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్నవాళ్లకి ప్రేక్షకులు ఎప్పుడు బ్రహ్మరథం పడతారు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేని వాళ్ళ సినిమాలు కూడా ఈరోజు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి. అలానే వారసత్వపరంగా కొంతమంది హీరోలు వచ్చినా కూడా అవి ఓపెనింగ్స్ మాత్రమే పరిమితం అవుతాయి తర్వాత టాలెంట్ మీదే వాళ్ల ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది.

Advertisement

ఒక నటుడుగా కెరియర్ మొదలుపెట్టి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నేనొక్కడినే వంటి సినిమాల్లో నటించాడు నవీన్ పోలిశెట్టి. అయితే ఆ సినిమాలు తర్వాత పెద్దగా తెలుగులో కనిపించకుండా ముంబైకి వెళ్లిపోయాడు. అక్కడ కొన్ని వీడియోస్ చేస్తూ బాగా పాపులర్ అయిపోయాడు. మొత్తానికి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

నవీన్ షాకింగ్ డెసిషన్

నవీన్ పోలిశెట్టి ఇప్పటివరకు మూడు సినిమాలు చేశాడు. ఈ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. అయితే ఈ మూడు సినిమాలకు మధ్య ఎంత గ్యాప్ ఉంది అని చూస్తే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. చాలామంది హీరోలు వరుసగా ప్రాజెక్టులు చేస్తుంటే నవీన్ మాత్రం టైం తీసుకుంటున్నాడు. తన ప్రాజెక్టులు లేట్ అవ్వడానికి కారణం ఏంటో రివీల్ చేశాడు నవీన్ పోలిశెట్టి. నేను ఒక పేజ్ లో ఉన్నప్పుడు నా రూమ్మేట్ ఎవరైనా సినిమాకి వెళ్దాం రా అంటే రూ. 400 డబ్బులు లేక ఆ సినిమా బాలేదు అంటారా వద్దురా అంటూ అబద్ధాలు చెప్పేవాడిని. ఎందుకంటే ప్రేక్షకులు దగ్గర ఉన్నది బ్లాక్ మనీ కాదు. వాళ్లు ఎంతో కష్టపడితే గాని ఆ 400 రూపాయలు రావు. అలాంటి వాళ్ల కోసం ఆలోచించి క్వాలిటీ ఉన్న సినిమాలు మాత్రమే నేను చేస్తున్నాను. నాకు వరుస హిట్ సినిమాలు ఎందుకు వస్తున్నాయి అని మీరు అనుకోవచ్చు కానీ ఆ సినిమాలను హిట్ చేస్తుంది మీరే.

గ్యాప్ కు అదే కారణం

Advertisement

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ సాధించింది అంటే ఒకవైపు దర్శకుడికి మరోవైపు హీరోకి వరుసగా అవకాశాలు రావడం కామన్ గా జరుగుతుంది. అలా వరుస అవకాశాలను చేసుకుంటూ వెళ్ళిపోతున్న తరుణంలో క్వాలిటీ మిస్ అవ్వడం జరుగుతుంది. కిరణ్ అబ్బవరం వరుస అవకాశాలతో సినిమాలు చేయటం వలన తన సినిమాల్లో క్వాలిటీ తగ్గిపోయింది అని అందరికీ ఒక ఆలోచన వచ్చేసింది. అందుకే కొంత గ్యాప్ తీసుకుని క వంటి కాన్సెప్ట్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇక నవీన్ పోలిశెట్టి కూడా చేసినవి తక్కువ సినిమాలే అయినా కూడా వాటికంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అనే ఉద్దేశంతోనే ఎక్కువ గ్యాప్ తీసుకుని సినిమాలను చేస్తున్నాడు. ముఖ్యంగా ప్రేక్షకుడిని సంతృప్తి పరచడమే తన టార్గెట్. నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా జనవరి 14న ప్రేక్షకులు ముందుకు వస్తుంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×