E-Paper
Advertisement

Anaganaga Oka Raju: ఎద్దులబండి పై ఈవెంట్ కు వచ్చిన నవీన్, అంతా రాజమౌళి ప్రభావం

Anaganaga Oka Raju: ఎద్దులబండి పై ఈవెంట్ కు వచ్చిన నవీన్, అంతా రాజమౌళి ప్రభావం
Advertisement

Anaganaga Oka Raju: దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాల్లో ఎస్ఎస్ రాజమౌళి ఆలోచించే విధానం ఊహ కూడా అందదు. కేవలం సినిమా టైటిల్ రిలీజ్ చేయడానికి ఏ స్థాయిన ఈవెంట్ చేశారు అందరం చూసాం. మామూలుగా అయితే చాలామంది పుట్టినరోజు సందర్భంగా కొన్ని ప్రత్యేక దినాల్లో కూడా టైటిల్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్తడే సందర్భంగా ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా, నవంబర్ లో ఒక ఈవెంట్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పిన మాదిరిగానే నవంబర్ 15న బిగ్గెస్ట్ ఈవెంట్ పెట్టి మరి టైటిల్ అనౌన్స్మెంట్ చేశారు.

Advertisement

రాజమౌళి తన సినిమాల విషయంలో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తారు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా మహేష్ బాబు ఏదైనా ఈవెంట్ కు చాలా ఫార్మల్ బట్టలు వేసుకొని హాజరవుతూ ఉంటాడు. అయితే తన సినిమా ఈవెంట్ కి కూడా ఎక్కువగా బులుగు చొక్కాకి ప్రిఫరెన్స్ ఇస్తాడు.

రాజమౌళి దారిలో

నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన సినిమా అనగనగా ఒక రాజు. సినిమా నుండి కొద్దిసేపటి క్రితమే ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ నేడు భీమవరంలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది.

Advertisement

అయితే ఈ ఈవెంట్ కు చాలా డిఫరెంట్ గా ఎద్దులు బండిమీద ఎంట్రీ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి ప్రత్యేకత ఏంటో మరోసారి ప్రూవ్ చేశాడు. అయితే ఈ సినిమాలో ఎద్దుల బండికి కూడా ఒక ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. అందుకోసమే నవీన్ ఎంట్రీ అలా ప్లాన్ చేశారు.

వారణాసి సినిమా ఈవెంట్లో మహేష్ బాబు నందిపై కూర్చుని త్రిశూలం పట్టుకున్న విజువల్ ఎంత హై ఇచ్చిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే కూడా ఈవెంట్ లో కూడా విపరీతమైన కష్టంతో మహేష్ ఎంట్రీ కూడా ప్లాన్ చేశారు. అది కూడా బానే వర్కౌట్ అయింది. మొత్తానికి రాజమౌళి ను టాలీవుడ్ మరోసారి ఫాలో అవబోతున్నట్లు అర్థమవుతుంది.

సంక్రాంతి కానుకగా 

ఇకపోతే అనగనగా ఒక రాజు సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ సినిమా పోస్ట్ పోన్ కానున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

అయితే ఈ సినిమా పక్కా గోదావరి నేపథ్యంలో జరగబోతుంది అని ఇప్పటివరకు విడుదలైన కంటెంట్ చూస్తే అర్థమవుతుంది. గతంలో తెలంగాణ యాసతో ఆకట్టుకున్న నవీన్ ఇప్పుడు గోదావరి ఆశతో ప్రేక్షకులను అలరించునున్నాడు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైన కంటెంట్ కూడా విపరీతమైన. నవీన్ పోలిశెట్టి పాడిన పాట కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఆ పాట కూడా ఆకట్టుకుంటుంది.

Also Read: Siddhu Jonnalagadda : సిద్దు జొన్నలగడ్డ ఉమనైజర్ అనే కామెంట్స్ పై, వాళ్ళ అన్నయ్య చైతు రియాక్షన్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×