E-Paper
Advertisement

పాపం హరీష్ శంకర్ …అసలు లెక్క చేయని నవీన్ పోలిశెట్టి!

పాపం హరీష్ శంకర్ …అసలు లెక్క చేయని నవీన్ పోలిశెట్టి!
Advertisement

NaveenPolishetty: టాలీవుడ్, కాలీవుడ్, శాండల్‌వుడ్ పరిశ్రమలకు చెందిన టాప్ మోస్ట్ కమర్షియల్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లు, నిర్మాతలు, యంగ్ హీరో అంతా ఒకే ఫ్రేమ్‌లోకి వచ్చి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘పుష్ప’ ఫేమ్ సుకుమార్, ‘కేజీఎఫ్’ సిరీస్‌తో రికార్డులు తిరగరాసిన ప్రశాంత్ నీల్, తనకంటూ ప్రత్యేకమైన సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేసుకున్న లోకేష్ కనగరాజ్, డివైన్ బ్లాక్‌బస్టర్ ‘కాంతార’ సంచలనం రిషభ్ శెట్టిలతో పాటు టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పోలిశెట్టి ఒకేచోట చేరి సందడి చేశారు. వీరితో పాటు టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యేర్నేని, రవిశంకర్, దర్శకుడు హరీశ్ శంకర్ కూడా ఈ గెట్-టుగెదర్‌లో భాగమయ్యారు.

ఇది ‘5500 కోట్ల రూపాయల ఫ్రేమ్’

Advertisement

ఈ భారీ కలయికపై టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి తన ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాల్లో షేర్ చేసిన ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఆ వీడియోలో నవీన్ తనదైన సిగ్నేచర్ హ్యూమర్ మరియు టైమింగ్‌తో ఈ గదిలోని ఫ్రేమ్ విలువను లెక్కగట్టాడు. విక్రమ్, లియో చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ వైపు చూపిస్తూ ఈయన వాల్యూ 500 కోట్లు, కాంతార రిషభ్ శెట్టి వాల్యూ 800 కోట్లు, పుష్ప 2 తో సిద్ధంగా ఉన్న మైత్రీ నిర్మాతలు మరియు సుకుమార్ కాంబినేషన్ కలిపి 2000 కోట్లు, సలార్ చిత్రంతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ వాల్యూ మరో 2000 కోట్లు అని లెక్కేసాడు. చివరగా నవ్వూతూ తన వాటాగా ఓ 100 కోట్లు వేసుకుని, మొత్తం మీద ఇది ‘5500 కోట్ల రూపాయల ఫ్రేమ్’ అంటూ నవీన్ చేసిన కామెంట్స్, దానికి అక్కడున్న స్టార్ దర్శకులు ఇచ్చిన రియాక్షన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Also read :Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

 చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయిన హరీష్ 

Advertisement

అయితే ఈ 5500 కోట్ల అరాచకమైన బాక్సాఫీస్ ఫ్రేమ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా ..? అక్కడ ఉన్నవారంతా వరుసగా వందల కోట్ల వసూళ్లు సాధించిన భారీ హిట్స్ లేదా ఇండస్ట్రీ హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నవారే. కానీ, అదే ఫ్రేమ్‌లో ఉన్న దర్శకుడు హరీశ్ శంకర్ పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఇందుకు భిన్నంగా ఉంది. పవన్ కళ్యాణ్‌తో ఆయన తెరకెక్కిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఈ నేపథ్యంలో నవీన్ పోలిశెట్టి ప్రతి ఒక్కరి బాక్సాఫీస్ వాల్యూను వందల కోట్లలో లెక్కగడుతూ వీడియో చేస్తున్నప్పుడు.. హరీశ్ శంకర్ మాత్రం పక్కనే చాలా సైలెంట్‌గా, చిరునవ్వుతో చూస్తూ ఉండిపోవడం గమనార్హం.టాప్ లీగ్‌లో ఉన్న మిగిలిన దర్శకులు వేల కోట్ల బిజినెస్‌తో దూసుకుపోతుంటే, హరీశ్ శంకర్ మాత్రం తన పూర్వ వైభవాన్ని అందుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నాడు .

పాన్ ఇండియా దిగ్గజాల మీటింగ్ 

ఈ గెట్-టుగెదర్ వీడియో చూసిన నెటిజన్లు కూడా, అందరి బాక్సాఫీస్ లెక్కలను వందల కోట్లలో తేల్చిన నవీన్, హరీశ్ శంకర్ దగ్గరకు వచ్చేసరికి ఆయన రీసెంట్ ఫ్లాపుల హిస్టరీని మైండ్‌లో పెట్టుకునే కావాలనే ఆయన వాల్యూను స్కిప్ చేసాడా అంటూ ఇండైరెక్ట్‌గా కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ, ఈ పాన్ ఇండియా దిగ్గజాల మీటింగ్ . ప్రస్తుతం మాత్రం ఈ ‘5500 కోట్ల ఫ్రేమ్’ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది .

Also read :నెట్టింట వైరల్ అవుతున్న లక్ష్మీ మంచు కామెంట్స్.. కలెక్షన్ కింగ్ వారసత్వం అంటే ఇదే మరి!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×