E-Paper
Advertisement

Meenakshi: మీనాక్షికి షాకింగ్ కండిషన్ పెట్టిన స్టార్ హీరో.. ఎవరు? ఎందుకో తెలిస్తే షాక్!

Meenakshi: మీనాక్షికి షాకింగ్ కండిషన్ పెట్టిన స్టార్ హీరో.. ఎవరు? ఎందుకో తెలిస్తే షాక్!
Advertisement

Meenakshi:మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary).. ప్రస్తుతం సంక్రాంతి హీరోయిన్గా పేరు దక్కించుకుంది. నిజానికి 2024లో త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)దర్శకత్వంలో మహేష్ బాబు(Maheshbabu ) హీరోగా వచ్చిన ‘గుంటూరు కారం’ సినిమాలో హీరోయిన్గా నటించి.. సంక్రాంతి బరిలో నిలిచి సక్సెస్ అందుకుంది. ఇక అదే జోషులో 2025 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 2026 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ప్రముఖ దర్శకుడు మారి (Maari) దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి (Naveen Polisetty) హీరోగా వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలో హీరోయిన్గా నటించి సక్సెస్ అందుకుంది. అలా గత మూడు సంవత్సరాలుగా సంక్రాంతికి తన సినిమాలను విడుదల చేస్తూ సంక్రాంతి హీరోయిన్గా పేరు దక్కించుకుంది మీనాక్షి చౌదరి.

మీనాక్షికి షాకింగ్ కండిషన్ పెట్టిన హీరో..

ఇకపోతే అలాంటి ఈ హీరోయిన్ కి ఒక స్టార్ హీరో షాకింగ్ కండిషన్ పెట్టారని అసలు విషయాన్ని రివీల్ చేశారు నిర్మాత నాగవంశీ (Naga Vamsi). విషయంలోకి వెళ్తే నవీన్ పోలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా వచ్చిన చిత్రం అనగనగా ఒక రాజు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా మొదటి రోజే 22 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసి.. రెండవ రోజు ఏకంగా డబుల్ డిజిట్ ను సాధించింది. ప్రస్తుతం కమర్షియల్ గా సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్న నేపథ్యంలో మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

Advertisement

ALSO READ:Ram Charan: ఎన్టీఆర్ కి ఆ పిచ్చి ఉంది.. చెర్రీ సంచలన కామెంట్లు!

అసలు విషయం బయటపెట్టిన నిర్మాత నాగవంశీ..

అందులో భాగంగానే నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ.. “మీనాక్షి చౌదరికి నవీన్ పోలిశెట్టి ఒక కండిషన్ పెట్టాడు. ముఖ్యంగా మీనాక్షిని ఎప్పుడైతే సెలెక్ట్ చేసామో.. ఆ రోజు నుంచి నువ్వు ఏ సినిమా ఒప్పుకోవద్దని నవీన్ ఆమెతో చెప్పాడు. సడన్ గా డేట్ అడిగితే ఇబ్బంది అవుతుందని తనను ఆపి ఏడాది పాటు ఏ సినిమా చేయనివ్వకుండా ఆమెను ఆపాడు. కచ్చితంగా సంక్రాంతికి హిట్ ఇస్తాము నువ్వు టెన్షన్ పడకు అని హామీ కూడా ఇచ్చాడు. పైగా అదే సమయంలో ఈ ఇయర్ నీవి ఏ సినిమాలు రిలీజ్ లేవు కదా అని పదేపదే అడిగే మా బుర్ర తినేసేది మీనాక్షి అందుకే ఆమె కోసమైనా ఈ సినిమా ఆడాలని కోరుకున్నాను” అంటూ చెప్పుకొచ్చారు నాగవంశీ. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

హీరో పెట్టిన కండిషన్.. మంచే జరిగిందిగా..

Advertisement

ఇకపోతే నవీన్ పోలిశెట్టి మీనాక్షికి పెట్టిన కండిషన్ సరైనదే అని .. అందుకే ఆమె ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఏడాది పాటు ఈ సినిమా కోసమే తన డేట్స్ కేటాయించి ఒక అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది మీనాక్షి చౌదరి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×