E-Paper
Advertisement

Nari Nari Naduma Murari: శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి 5:49 విడుదల వెనుక ఇదే కారణమా?

Nari Nari Naduma Murari: శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి 5:49 విడుదల వెనుక ఇదే కారణమా?
Advertisement

Nari Nari Naduma Murari: సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్(Sharwanand) సైతం నారీ నారీ నడుమ మురారి (Nari Nari Naduma Murari)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా జనవరి 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్లోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సినిమా విడుదలపై సెంటిమెంట్..

ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా నిర్మాత అనిల్ సుంకరకు మీడియా వారి నుంచి ఊహించని ప్రశ్న ఎదురయింది. ఈ సినిమా జనవరి 15వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో జనవరి 14వ తేదీన ఈ సినిమా ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి. ఇక జనవరి 14వ తేదీ 5:49 నిమిషాలకు షో పడనుంది. ఇలా 5:49 నిమిషాలకు సరిగ్గా ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆ సమయమే ఎందుకు అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు అనిల్ సుంకర సమాధానం చెబుతూ నిజానికి ఈ సినిమా జనవరి 15వ తేదీన విడుదల చేయాలి అనుకున్నాం కాకపోతే మా ఇంట్లో వాళ్ళు ఇచ్చిన కొన్ని సలహాల వల్ల 14వ తేదీ సాయంత్రం 5:49 నిమిషాలకు విడుదల కాబోతుందని తెలిపారు.

ఏకాదశి గడియలు..

Advertisement

14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఏకాదశి గడియలు ఉన్నాయి. సరిగా 6 గంటలకు సినిమాని విడుదల చేయాలి అనుకుంటే సినిమా ప్రారంభం అయ్యేసరికి ఆరు దాటిపోతుంది అందుకనే 5:49 నిమిషాలకు ఈ సినిమాని విడుదల చేయబోతున్నాము అంటూ ఈ సమయం వెనుక ఉన్న కారణాన్ని అనిల్ సుంకర తెలియచేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అనిల్ సుంకర కూడా ఇలాంటి వాటిని నమ్ముతారా? శుభ ఘడియలలో శర్వానంద్ సినిమా విడుదల కాబోతోంది మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

నిరాశ పరుస్తున్న శర్వానంద్ సినిమాలు…

Advertisement

ఇక ఇటీవల కాలంలో శర్వానంద్ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఏ సినిమాలో కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి మరోవైపు నిర్మాత అనిల్ సుంకరకు కూడా వరుస సినిమాలు నిరాశనే మిగిలిస్తున్న ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ నారీ నారీ నడుమ మురారి పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా మాజీ ప్రేయసి ప్రస్తుత ప్రేయసి మధ్య నలిగిపోయే ప్రియుడి కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో శర్వానంద్ జోడిగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలనే పెంచేసాయి. మరి 15వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Also Read: Allu Arjun: జపాన్ లో అడుగుపెట్టిన పుష్పరాజ్..ఇక రప్పా రప్పానే!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×