E-Paper
Advertisement

Nari Nari Naduma Murari Film: సెన్సార్ పూర్తి చేసుకున్న శర్వా నంద్ మూవీ.. రన్ టైం డీటెయిల్స్!

Nari Nari Naduma Murari Film: సెన్సార్ పూర్తి చేసుకున్న శర్వా నంద్ మూవీ.. రన్ టైం డీటెయిల్స్!
Advertisement

Nari Nari Naduma Murari Film: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సంక్రాంతి పండుగ సందర్భంగా నారీ నారీ నడుమ మురారి (Nari Nari Naduma Murari )అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 15వ తేదీ విడుదల కాబోతోంది. జనవరి 14వ తేదీ సాయంత్రం ఈ సినిమా ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి. ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగిన నేపథ్యంలో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హీరోయిన్లతో పాటు నిర్మాత అనిల్ సుంకర(Anil Sunkara) వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.

U/A సర్టిఫికెట్ జారీ..

ఈ సినిమా విడుదలకు కొద్ది రోజులు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ (Censor) కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుందని తెలుస్తుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాని వీక్షించిన తర్వాత జీరో కట్స్ తో ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు చిత్ర బృందం అధికారకంగా పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇక ఈ సినిమాకు 2:05 గంటల రన్ టైం లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఇలా ఈ సినిమాలో ఎలాంటి సెన్సార్ కట్స్ లేకపోవడం విశేషం.. ఇక ఈ సినిమా మరొక వారం రోజులలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా మరింత వేగవంతం చేయనున్నారు.

త్వరలోనే ట్రైలర్ రిలీజ్…

Advertisement

ఇటీవల ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేయగా ఈ పాటకు మంచి ఆదరణ లభించింది. త్వరలోనే ట్రైలర్ తో పాటు ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో శర్వానంద్ జోడిగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు.

గెస్ట్ రోల్ లో శ్రీ విష్ణు..

Advertisement

ఇక ఈ సినిమాలో మరో స్టార్ యంగ్ హీరో కూడా సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే .ఇటీవల శ్రీ విష్ణు(Sree Vishnu) ఈ సినిమాలో భాగం అయ్యారంటూ చిత్ర బృందం ఒక స్పెషల్ వీడియో ద్వారా విడుదల చేశారు. ఇలా శ్రీ విష్ణు శర్వానంద్ కాంబోలో వచ్చే సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయని తెలుస్తోంది. ఇలా ఈ సినిమాలో శ్రీ విష్ణు నటించబోతున్నారంటూ వీడియోని విడుదల చేయడంతో సినిమా పట్ల మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. గత కొద్దిరోజులుగా వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న శర్వానంద్ ఈసారైనా సక్సెస్ కొడతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Anaganaga Oka Raju: రిలీజ్‌కు ముందే పోలిశెట్టి సినిమాకు లాభాలు.. సేఫ్ జోన్‌లో నిర్మాత నాగవంశీ

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×