E-Paper
Advertisement

The Paradise film: తలైవా సినిమాకు పోటీగా నాని ది ప్యారడైజ్… బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీ!

The Paradise film: తలైవా సినిమాకు పోటీగా నాని ది ప్యారడైజ్… బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీ!
Advertisement

The Paradise film: నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం ది ప్యారడైజ్ (The Paradise). శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల కూడా వాయిదా వేసుకుంది. నిజానికి ఈ సినిమా మార్చ్ 26వ తేదీ ఏకంగా ఎనిమిది భాషలలో విడుదలకు సిద్ధమైంది. మార్చి 26వ తేదీ కచ్చితంగా ఈ సినిమా విడుదల అవుతుందని అభిమానులు భావించారు. కానీ గత కొంతకాలంగా ఈ సినిమా వాయిదా పడుతుందంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఇలా ఈ సినిమా వాయిదా గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా చిత్ర బృందం మాత్రం స్పందించని నేపథ్యంలో అభిమానులు కూడా అయోమయ పరిస్థితిలలో ఉన్నారు.

ఆగస్టు 21న నాని ది ప్యారడైజ్..

ఇకపోతే తాజాగా చిత్ర బృందం ఈ సినిమా కొత్త విడుదల తేదీని అధికారకంగా ప్రకటించారు .ఈ సినిమా ఆగస్టు 21వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుందని తెలిపారు. ఇలా నాని సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించడంతో అభిమానులు కూడా కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మార్చిలో పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా వేసవి సెలవులలో విడుదలవుతుందని భావించారు కానీ ఏకంగా ఆగస్టు నెలలో విడుదల చేయబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించడంతో బాక్స్ ఆఫీస్ వద్ద నాని సినిమాకు గట్టి పోటీ ఉండబోతుందని తెలుస్తోంది.

నానికి పోటీగా జైలర్ 2 విడుదల..

Advertisement

నాని ది ప్యారడైజ్ విడుదల రోజు రజనీకాంత్ నటించిన జైలర్2 (Jailer 2)సినిమాని కూడా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ బరిలో గట్టి పోటీగా నిలవబోతున్నాయని చెప్పాలి. గత ఏడాది ఆగస్టు 14వ తేదీ రజినీకాంత్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద పోటీపడిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా నాని రజనీకాంత్ సినిమాతో పోటీకి దిగబోతున్నారు.
ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

నాని కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమా..

Advertisement

ఇదివరకే జైలర్ సినిమా విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా జైలర్ 2 సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరి ఈ రెండు సినిమాలు ఒకేసారి పోటీకి దిగుతాయా లేదంటే మళ్లీ ఏదో ఒక సినిమా వెనకడుగు వేసే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ది ప్యారడైజ్ సినిమా నాని కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పలు అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో నాని లుక్ కూడా విభిన్నంగా ఉండబోతున్న సంగతి తెలిసిందే ఇందులో జడల అనే పాత్రలో నాని కనిపించబోతున్నారు.

Also Read: Vishwak Sen: అర్జున్ సీతాపయనం పై విశ్వక్ సేన్ ఫస్ట్ రియాక్షన్.. విభేదాలు తొలగినట్టేనా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×