// // The Paradise Film: ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్  లోడింగ్.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

The Paradise Film: నాని ఫాన్స్ కు గుడ్ న్యూస్… ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్  లోడింగ్..

The Paradise Film: నాని ఫాన్స్ కు గుడ్ న్యూస్… ది ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్  లోడింగ్..
Advertisement

The Paradise Film: టాలీవుడ్ యంగ్ హీరో నాచురల్ స్టార్ నాని (Nani) ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ హీరోగా ఎంతో బిజీగా ఉన్నారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా సక్సెస్ అందుకున్న నాని మరోవైపు నిర్మాతగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు నాని నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ కూడా ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం నాని ది ప్యారడైజ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

8 భాషలలో ది ప్యారడైజ్..

దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా (Sreekanth Odela) దకత్వంలో నాని నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్(The paradise). ఈ సినిమాని 2026 మార్చి 26వ తేదీ ఏకంగా 8 భాషలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే ఈ సినిమాని మార్చి నెలలో విడుదల చేయబోతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తెలియజేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అలాగే గ్లింప్ కు సంబంధించిన అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఫిబ్రవరి మొదటి వారంలో ఫస్ట్ సింగిల్..

Advertisement

ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయబోతున్నారట అలాగే గ్లింప్ వీడియోను ఫిబ్రవరి 24వ తేదీ విడుదల చేయబోతున్నట్టు తాజాగా నిర్మాత చెరుకూరి సుధాకర్ తెలియజేశారు. ఈయన రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నాని సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు. ఇలా ఈ సినిమా అప్డేట్ గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో నాని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే వీటికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోంది. ఈ సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహించగా, చెరుకూరి సుధాకర్ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఈ సినిమాలో నాని జడల అనే విబిన్న పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

విలన్ పాత్రలో మోహన్ బాబు..

Advertisement

ఇప్పటికే నానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కావడంతో ఈయన ఇప్పటివరకు ఏ సినిమాలోను నటించని విధంగా విభిన్నమైన పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని స్పష్టం అవుతుంది. ఈ సినిమాలో మోహన్ బాబు , సంపూర్ణేష్ వంటి తదితరులు కూడా కీలకపాత్రలలో కనిపించనున్నారు. నానికి జోడిగా కాయదు లోహర్ హీరోయిన్ గా కనిపించబోతున్నారు. నాని సినీ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం నాని అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Anil Sunkara: టికెట్ల రేట్లపై అనిల్ సుంకర కామెంట్స్.. ఉల్లిపాయల ధరలతో పోలికా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×