E-Paper
Advertisement

Champion : పాతిక సంవత్సరాలు తర్వాత ఆ నందమూరి వారసుడు ఇండస్ట్రీకి రీ ఎంట్రీ

Champion : పాతిక సంవత్సరాలు తర్వాత ఆ నందమూరి వారసుడు ఇండస్ట్రీకి రీ ఎంట్రీ
Advertisement

Champion : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వారసత్వంతో వచ్చిన చాలామంది నటులు ఉన్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన బాలకృష్ణ నేడు సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు. బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు ఎన్టీఆర్ మనవడుగా మంచి గుర్తింపు సాధించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్నాడు.

అయితే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ సోదరుడు నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. కళ్యాణ్ చక్రవర్తి గురించి ఇప్పుడు ఉన్న ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ అప్పట్లో హీరోగా అలానే సహాయ నటుడుగా పనిచేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి.

పాతిక సంవత్సరాలు తర్వాత రీఎంట్రీ

Advertisement

1986లో వచ్చిన అత్తగారు స్వాగతం అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. ఆ తర్వాత దాదాపు 15 సినిమాల వరకు నటించారు. అత్తగారూ స్వాగతం — దీని ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. తలంబ్రాలు ,ఇంటి దొంగ ,రౌడీ బాబాయ్, మరణహోమం , మెగాస్టార్ చిరంజీవి చేసిన లంకేశ్వరుడు వంటి సినిమాల్లో కీలక పాత్రలో కనిపించాడు.

అయితే అప్పట్లో సినిమా ఇండస్ట్రీ మద్రాసు నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అవడం అదే తరుణంలో అతని తండ్రి త్రివిక్రమ్ రావుకి ఆరోగ్యం క్షమించడం వంటివి జరిగాయి. అయితే అతని తండ్రిని చూసుకోవడంలో భాగంగా సినిమాలకు కళ్యాణ్ చక్రవర్తి దూరం అయిపోయారు అనే వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. చాలామంది నటుడుగా కళ్యాణ్ చక్రవర్తిని మర్చిపోయారు. మళ్లీ పాతిక సంవత్సరాలు తర్వాత కళ్యాణ్ చక్రవర్తి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

ఎలా పట్టుకున్నారో? 

Advertisement

ప్రదీప్ అద్వైత దర్శకత్వంలో రోషన్ మేక నటిస్తున్న సినిమా ఛాంపియన్. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ సాధించుకుంది. అయితే ఈ సినిమాలో రాజిరెడ్డి అనే పాత్రలో కనిపించబోతున్నారు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. చాలామందికి ఇది ఆశ్చర్యం కలిగిస్తుంది.

అప్పట్లో మంచి సినిమాలు చేసిన కళ్యాణ్ చక్రవర్తి ఏమైపోయాడో కూడా ఎవరికీ తెలియదు. అటువంటి వ్యక్తిని పట్టుకొని మళ్ళీ తెలుగు తెరమీద ఆవిష్కరించటం అనేది బిగ్ సర్ప్రైజ్. ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్ కి ఆట సందీప్ కొరియోగ్రఫీ చేశారు. ప్రస్తుతం ఆ పాట ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో బాగా వైరల్ గా మారింది.

Also Read : Mana Shankara Vara Prasad Gaaru : రేపు పొద్దున్నే ఫుల్ సాంగ్ విడుదల, ట్రోల్స్ ప్రభావంతోనే నిర్ణయం?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×