E-Paper
Advertisement

Nandamuri Networth: నందమూరి హరోల నెట్ వర్త్ ఎంతో తెలుసా.. టాప్‌లో ఉన్నది ఎవరంటే?

Nandamuri Networth: నందమూరి హరోల నెట్ వర్త్ ఎంతో తెలుసా.. టాప్‌లో ఉన్నది ఎవరంటే?
Advertisement

Nandamuri Networth: నందమూరి కుటుంబం తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనూ, అటు రాజకీయాల్లోనూ దశాబ్దాలుగా తిరుగులేని ప్రాభవాన్ని చాటుతోంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) స్థాపించిన ఈ వారసత్వం నేటికీ కొనసాగుతోంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా, రియల్ ఎస్టేట్, వ్యాపారాలు, రాజకీయ పదవుల ద్వారా ఈ కుటుంబ సభ్యులు భారీగా ఆస్తులను కూడబెట్టారు. నందమూరి హీరోల నెట్ వర్త్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సమాచారం ప్రకారం ఎవరి ఆస్తులు ఏ స్థాయిలో ఉన్నాయంటే?

Read also-Vijay – Rashmika : విజయ్- రష్మిక పెళ్లి డేట్ లాక్.. పెళ్లి ఎక్కడంటే..?

నందమూరి బాలకృష్ణ (NBK)

Advertisement

నందమూరి వారసుల్లో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నది నందమూరి బాలకృష్ణ. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించిన ఆయన, అటు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు. బాలయ్య నెట్ వర్త్ సుమారుగా రూ. 800 కోట్ల నుండి రూ.1000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ (సుమారు రూ. 20-30 కోట్లు) వరకూ ఉంటుంది. బ్రాండ్ అంబాసిడర్ ఫీజులు, హైదరాబాద్‌లోని ఖరీదైన జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న స్థిరాస్తులు ఆయన ఆస్తిలో ప్రధాన భాగాలుగా ఉన్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR)

గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తారక్, తన తాతగారి పేరును సార్థకం చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ఆయన నెట్ వర్త్ సుమారు రూ. 450 కోట్ల నుండి రూ.500 కోట్ల వరకు ఉంటుందని ట్రేడ్ వర్గాల సమాచారం. ‘RRR’ వంటి సినిమాల తర్వాత ఆయన రెమ్యునరేషన్ భారీగా పెరిగింది. ఒక్కో సినిమాకు తారక్ దాదాపు రూ. 60 నుండి రూ.100 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా లగ్జరీ కార్ల కలెక్షన్, ప్రైవేట్ జెట్, యాడ్ ఫిల్మ్స్ ద్వారా ఆయన భారీగా అర్జిస్తున్నారు.

Advertisement

Read also-Mumbai: బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటి వద్ద కాల్పులు.. రంగంలోకి పోలీసులు, ముంబైలో హై అలర్ట్!

నందమూరి కళ్యాణ్ రామ్

నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కళ్యాణ్ రామ్ రాణిస్తున్నారు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్‌పై భారీ సినిమాలు నిర్మిస్తూ లాభాలు గడిస్తున్నారు. ఆయన నెట్ వర్త్ సుమారు రూ. 150 కోట్లు ఉంటుందని అంచనా. కళ్యాణ్ రామ్ ఒక్కో సినిమాకు గాను రూ.10 నుంచి రూ. 15 కోట్లు తీసుకుంటారని సమాచారం. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అగ్రస్థానంలో నిలుస్తున్నారు. ఆయనకు ఉన్న దశాబ్దాల అనుభవం, తండ్రి నుంచి వచ్చిన వారసత్వ ఆస్తులు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఆయన్ను నందమూరి హీరోలందరిలోకెల్ ధనవంతుడిగా నిలబెట్టాయి. అయితే, ప్రస్తుత మార్కెట్ విలువ వార్షిక ఆదాయం (Annual Income) పరంగా చూస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గట్టి పోటీ ఇస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×