E-Paper
Advertisement

Balakrishna Favourite Movie: చిరంజీవి సినిమాలలో బాలకృష్ణ ఫేవరెట్ సినిమా ఏమిటో తెలుసా..!

Balakrishna Favourite Movie: చిరంజీవి సినిమాలలో బాలకృష్ణ ఫేవరెట్ సినిమా ఏమిటో తెలుసా..!
Advertisement

Balakrishna Favourite Movie: ఎన్నో సంవత్సరాల నుంచి బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఎంతలా పోటీ పడుతుంటాయో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎన్నో సంక్రాంతికి వీళ్ళిద్దరి సినిమాలు విడుదలై ఒకదాని పైన ఒకటి విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ ఇద్దరి హీరోల అభిమానులు ఎప్పటికప్పుడు తమ హీరో గొప్ప.. అంటే తమ హీరో గొప్ప అంటూ కూడా వాదన జరుపుతూ ఉంటారు. అలాంటి తెలుగు ఇండస్ట్రీ దిగ్గజాలు అయిన వీరిద్దరు మాత్రం ఒకరితో ఒకరు స్నేహభావంతో కలిసి ఉంటూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు.

ఇద్దరు నటులు ఒకరి సినిమాలపై మరొకరు గౌరవం చూపిస్తుంటారు. పలు సందర్భాల్లో ఒకరి విజయాలను మరొకరు అభినందించారు. సినిమా కార్యక్రమాల్లో కలిసినప్పుడు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ కనిపిస్తారు.

బాలకృష్ణకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం..!

Advertisement

బాలకృష్ణ ఒకసారి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి నటించిన “జగదేకవీరుడు అతిలోకసుందరి” సినిమా తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఆ సినిమా కథ, మేకింగ్ మరియు విజువల్స్ తనను చాలా ఆకట్టుకున్నాయని తెలిపారు. తెలుగు సినిమా చరిత్రలో ఆ చిత్రం ఒక ప్రత్యేక స్థానం సంపాదించిందని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీదేవి హీరోయిన్గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాని బాలకృష్ణ తనకెంతో ఇష్టం అని చెప్పారు..

చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమా కూడా..!

అంతేకాకుండా చిరంజీవి నటించిన ఖైదీ సినిమా కూడా తనకు ఎంతో ఇష్టమని బాలకృష్ణ చెప్పారు. ఆ సినిమాలో చిరంజీవి చేసిన యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్స్‌లు ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో చిరంజీవి చూపించే స్టైల్ మరియు గ్రేస్ తనకు చాలా నచ్చుతాయని బాలకృష్ణ వెల్లడించారు.

Advertisement

మరోప బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు.. సమరసింహారెడ్డి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఈ సినిమాల గురించి చిరంజీవి కూడా పలు సందర్భాల్లో ప్రశంసలు చెప్పారు. ఇలా బాక్సాఫీస్ వద్ద పోటీ ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా ఒకరి పట్ల మరొకరికి గౌరవం.. స్నేహం ఉండటం అందరినీ తెగ ఆకట్టుకుంటుంది.

ALSO READ: Thalapathy Vijay: విజయ్ ఇంట్లోనే ఉంటా.. కోర్టులో సంగీత కొత్త పిటిషన్..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×