E-Paper
Advertisement

Akhanda 2 : పూనకాలు తెప్పిస్తున్న అఖండ 2 రిలీజ్ ట్రైలర్, హైప్ తోనే పోతారేమో 

Akhanda 2 : పూనకాలు తెప్పిస్తున్న అఖండ 2 రిలీజ్ ట్రైలర్, హైప్ తోనే పోతారేమో 
Advertisement

Akhanda 2 : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న బ్లాక్ బస్టర్ కాంబినేషన్ బోయపాటి శ్రీను మరియు నందమూరి బాలకృష్ణ. సింహ సినిమాతో మొదలైన వీళ్ళ ప్రస్థానం ఇప్పటివరకు సక్సెస్ఫుల్ గా కొనసాగింది. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ సినిమాలు ఉన్నాయి. అసలు బాలకృష్ణ ఏమి చేస్తే ప్రేక్షకులకి నచ్చుతుందో అని పూర్తి అవగాహన ఉన్న దర్శకుడు బోయపాటి శ్రీను అని కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కి సరిపడా సీన్స్ డిజైన్ చేస్తూ ఉంటాడు బోయపాటి.

అయితే వీరిద్దరూ కలిసి అఖండ 2 సినిమా చేసిన సంగతి తెలిసిందే ఈపాటికి థియేటర్స్ లో విడుదలై సంచలనం సృష్టించవలసిన ఈ సినిమా చివరి నిమిషంలో వాయిదా పడిపోయింది. దానికి కొన్ని ఆర్థిక లావాదేవీలు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసిన అభిమానులకు నిన్నటితో డిసెంబర్ 12న వస్తుంది అని క్లారిటీ ఇచ్చేసారు. రేపు సాయంత్రం నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ మొదలుకానున్నాయి. ఈ తరుణంలో మరో రిలీజ్ టీజర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

అఖండ 2 రిలీజ్ టీజర్ 

Advertisement

ఇప్పటికే సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ టీజర్ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ఈ టీజర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు ఎవర్రా విభూది కొండని ఆపేది? అలానే ఒక్క మనిషిని పట్టుకొని దిష్టి తీసి రివర్స్ ల నేలకేసి కొట్టినప్పుడు వచ్చే షాట్ నెక్స్ట్ లెవెల్. ఇది కదా బాలయ్య అభిమానులకు కావాల్సింది అనిపించేలా ఉంది రిలీజ్ టీజర్.

తాండవం ఖాయం

Advertisement

ఇకపోతే ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ అవుతుంది అని ఉద్దేశంతోనే చాలామంది ఎదురు చూస్తున్నారు మరోవైపు సినిమా తాండవం పక్కన పెడితే థియేటర్లో కూడా తాండవం మొదలుకానున్నట్లు అర్థమయిపోతుంది. బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు, ఖచ్చితంగా ఒక మెసేజ్ డిజైన్ చేయబడి ఉంటుంది.

అయితే ఈ సినిమాలో ఎక్కువగా సనాతన ధర్మం గురించి చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. స్వతహాగా బాలకృష్ణ ఎంత భక్తితో ఉంటారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో కూడా పలు సందర్భాలలో ముహూర్తాలు పెట్టి అప్డేట్స్ ఇచ్చారు. ఈ టీజర్ కూడా 7 : 16 నిమిషాలకు అని చెప్పారు కానీ సరైన టైమ్ కి విడుదల చేయలేకపోయారు.

Also Read : JETLEE : రియా ఇక్కడే, కమెడియన్ సత్యకు హీరోయిన్ సెట్, కానీ ఆ కండిషన్స్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×