E-Paper
Advertisement

War 2 : మీ హీరోతో సినిమా చేస్తే టేబుల్ ప్రాఫిట్ అన్నారు, టేబులే మిగిలింది ఇక్కడ

War 2 : మీ హీరోతో సినిమా చేస్తే టేబుల్ ప్రాఫిట్ అన్నారు, టేబులే మిగిలింది ఇక్కడ
Advertisement

War 2 : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ సినిమా ఎలా ఆడుతుంది అనేది ఎవరు డిసైడ్ చేయలేరు. ఒకవేళ సినిమా ఇలా తీస్తే సక్సెస్ అవుతుంది అనే క్లారిటీ దర్శకులకు ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని సూపర్ హిట్ సినిమాలే వస్తాయి. సినిమా అనేది అయితే ఆకాశానికి తీసుకెళ్తుంది లేకపోతే పాతాళానికి తొక్కేస్తుంది. ఒక దర్శకుడు ఆలోచన నమ్మి డబ్బులు పెట్టిన నిర్మాత చాలా ఒత్తిడితో బతకాల్సిన పరిస్థితి ఎప్పటినుంచో ఉంది.

అయితే కేవలం సినిమా నిర్మించడమే కాకుండా డిస్టిబ్యూషన్ లో కూడా చాలా దెబ్బలు తగులుతాయి. గతంలో దిల్ రాజు తాను అమృత అనే ఒక సినిమాను కొన్నానని, ఆ సినిమా తీవ్రమైన నష్టాలు తీసుకొచ్చింది అని చెప్పారు. ఆ తరుణంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. బాల్ కింద పడింది అంటే అది ఖచ్చితంగా పైకి లేస్తుంది మీరు కూడా అంతే అని ధైర్యం ఇచ్చారట. అదే మాదిరిగా నేడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దిల్ రాజు ఒక స్థాయిని సంపాదించుకున్నారు.

Advertisement

భారీ లాస్ వచ్చిందా.?

ఇక అసలు విషయానికొస్తే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా వార్ 2. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉండేవి. ఈ సినిమాకి సంబంధించి తెలుగు డిస్ట్రిబ్యూషన్ యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ తీసుకున్నారు. ముందుగా నాగ వంశీ కూలీ సినిమా రైట్స్ కోసం ప్రయత్నించారు. కానీ అది జరగలేదు. ఇక ఎన్టీఆర్ మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో వార్ 2 డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. హైదరాబాదులో చాలా థియేటర్స్ ఈ సినిమా కోసం కేటాయించారు. కొంతమేరకు సినిమాకు మంచి టాక్ ఏ వచ్చింది. అయితే ఈ సినిమా కలెక్షన్ విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ సినిమా విషయంలో భారీ లాస్ వచ్చింది అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.

Advertisement

టేబుల్ ఏ మిగిలింది.?

గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగ వంశీ నేనింతే సినిమాలో పూరి జగన్నాథ్ గారు ఒక మాట రాస్తారు. సినిమా చూసి రివ్యూ చదవాలి తప్ప రివ్యూ చదివి సినిమాకి వెళ్లకూడదు అని గుర్తు చేశారు. ఇప్పుడు నేనింతే సినిమా డైలాగ్ నాగ వంశీకి అన్వయిస్తున్నారు చాలామంది. మీ హీరోతో సినిమా చేస్తే టేబుల్ ప్రాఫిట్ అన్నారు. ఈరోజు ఆఫీసులో టేబుల్ ఏ మిగిలింది అని సియాజ్ సిండే ది ఒక సీన్ ఉంటుంది. ఇప్పుడు అదే సీన్ ని రీ క్రియేట్ చేసి నాగ వంశీకి వాడుతున్నారు. అయితే ఈ సినిమా విషయంలో ఎంత కోల్పోయారు, లేదంటే ఎంత లాభపడ్డారు అనేది నాగ వంశీ ఒకరోజు మీడియా ముందు చెబుతారు. అందులో సందేహం లేదు.

Also Read: Nagarjuna: ఆ దర్శకుడును పీడించిన నాగార్జున, చివరికి ఏం జరిగిందంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×