E-Paper
Advertisement

నాడు పర్సనల్ ఎటాక్.. నేడు బిజినెస్ ఎటాక్ ….నాగవంశీ టార్గెట్ సునీల్ నారంగేనా ?

నాడు పర్సనల్ ఎటాక్.. నేడు బిజినెస్ ఎటాక్ ….నాగవంశీ టార్గెట్ సునీల్ నారంగేనా ?
Advertisement

Theatre War: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏది ఎలా వైరల్ అవుతుందో చెప్పలేము.కానీ ఒక్కసారి హైలెట్ అయ్యాక కూల్ అవ్వడం అంత ఈజీ కాదు .అవును టాలీవుడ్ లో గత కొన్ని నెలలుగా ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పుడు మరో టర్న్ తీసుకున్నట్టే కనిపిస్తుంది .ముఖ్యంగా సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కం ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ మధ్య నడిచిన కోల్డ్ వార్ నడిచిన సంగతి తెలిసిందే.

గతంలో థియేటర్ రెంట్లు పర్సంటేజ్ ల వివాదం ముదిరినప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన మరి నాగ వంశీని టార్గెట్ చేస్తూ విగ్గు అంటూ పర్సనల్ గా  విమర్శలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది .అయితే ఆ సమయంలో నాగవంశీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారనే డానికి తాజాగా ఆయన ఇచ్చిన ఆన్సర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి.అవును.. మామూలుగా ఎవరైనా పర్సనల్ గా  అటాక్ చేస్తే రియాక్ట్ అవ్వడం సహజం.కానీ నాగవంశి మాత్రం సైలెంట్ కిల్లర్ లా  సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇదే విషయమై ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు వింటుంటే ప్రత్యర్థికి ఎలా కౌంటర్ ఇవ్వనున్నాడో  అర్థమవుతుంది కూడా .

Advertisement

యుద్ధం ఇప్పుడే మొదలైంది

‘వాళ్లు బాగా డబ్బున్న వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు  అంటూ లైట్ తీసుకున్నట్టు కనిపిస్తూనే అసలు సిసలైన వార్నింగ్ ఇచ్చాడు .’మేం కంటెంట్ ఓనర్లం మేము చేయాల్సిన డ్యామేజ్ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో నాకు బాగా తెలుసు .యుద్ధం ఇప్పుడే మొదలైంది మాకు ఒక టైం వస్తుంది’ అంటూ సునీల్ నారంగ్ కి  ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేశాడు నాగ వంశీ .అయితే ఈ కామెంట్స్ వెనుకున్న అసలు గుట్టు ఏమిటంటే థియేటర్లో ఎన్ని ఉన్నా వాటిని నడపాలంటే నిర్మాత ఇచ్చే కంటెంట్ ఉండాల్సిందే.సో ఆ కంటెంట్ పవర్ ఏంటో చూపిస్తామనేది నాగ వంశీ ఇన్నర్ ఫీలింగ్ అన్నమాట.

Advertisement

గతంలో గుంటూరు కారం, టిల్లు స్క్వేర్ సినిమాల రిలీజ్ ముందు థియేటర్ల కేటాయింపు పర్సెంటేజీ విషయంలో ఎన్ని డ్రామాలు జరిగాయో తెలిసిందో. అప్పులు తెచ్చి సినిమాలు తీసే నిర్మాతలు థియేటర్ల యాజమాన్యాల ముందు మోకాళ్ళ మీద నిలబడాల్సిన పరిస్థితి రావడంపై మనసులోని బాధని బయటపెట్టాడు నాగవంశీ.అందుకే ఇప్పుడు నిర్మాతలు అంతా ఒకే తాటిపైకి వచ్చి సాలిడ్ ప్లాన్  సిద్ధం చేస్తున్నారట.

కంటెంట్ వర్సెస్ థియేటర్స్

ఇకపై బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు ఒకే వారంలో రిలీజ్ కాకుండా ప్లానింగ్ చేస్తున్నారని తెలుస్తుంది.అంటే దీనివల్ల థియేటర్లకు కంటెంట్ కొరత ఏర్పడుతుంది సో అప్పుడు థియేటర్లు ఖాళీగా ఉంచుకోలేక వచ్చి నిర్మాతలు చెప్పిన పర్సంటేజీ విధానానికి తలవంచక పరిస్థితి వస్తుందన్నమాట. సో మొత్తంగా సునీల్ నారంగ్  సినిమాస్ నెట్ వర్క్ ని మైండ్లో పెట్టుకుని నాగవంశీ  ఈ రేంజ్ ప్లాన్  చేశాడని ఫిలింనగర్ సర్కిల్ లో వినిపిస్తున్నమాట.థియేటర్ల రెంట్లు కట్టలేక ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడే రోజులు ముందున్నాయని అసలు ఆట అప్పుడు మొదలవుతుందని హింట్ ఇచ్చాడు నాగ వంశీ .అంటే పర్సనల్ అటాక్స్ చేసినవారికి మాటలతో కాకుండా బిజినెస్ తో కోలుకోలేని  దెబ్బ కొట్టనున్నాడన్నమాట నాగ వంశీ .మరి కంటెంట్ వర్సెస్ థియేటర్స్ వారిలో ఎవరు గెలుస్తారో చూడాలి

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×