E-Paper
Advertisement

Naga Vamshi About Jr NTR: తారక్ అన్న వాడినదే కావాలి అని అడిగి మరి తీసుకున్నాను.. నాగ వంశీ కీలక వ్యాఖ్యలు..!

Naga Vamshi About Jr NTR: తారక్ అన్న వాడినదే కావాలి అని అడిగి మరి తీసుకున్నాను.. నాగ వంశీ కీలక వ్యాఖ్యలు..!
Advertisement

Naga Vamshi About Jr NTR: ప్రముఖ నిర్మాత నాగ వంశీ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా అభిమానుల్లో విస్తృతంగా.. చర్చకు దారి తీస్తున్నాయి. నిర్మాతలు హీరోలతో లేదా దర్శకులతో మంచి సంబంధాలు కొనసాగించేందుకు బహుమతులు ఇస్తారా? అనే ప్రశ్నకు.. ఆయన ఇచ్చిన సమాధానాలు అందరినీ ఆకట్టుకుంది.

ఇంటర్వ్యూలో యాంకర్, “సాధారణంగా నిర్మాతలు హీరోలకు లేదా దర్శకులకు గిఫ్టులు ఇస్తుంటారు కదా?” అని అడగగా..దీనికి నాగ వంశీ .. అలా ఏమీ లేదు అవన్నీ అబద్ధాలే అని చెప్పుకొచ్చాడు.
అయితే యాంకర్ మళ్లీ ప్రశ్నిస్తూ, “మీరేమైనా హీరోల నుంచి గిఫ్టులు తీసుకున్నారా?” అని అడగగా, నాగ వంశీ.. “అవును… నాకు ఇద్దరు హీరోల నుంచే గిఫ్టులు వచ్చాయి” అని చెప్పారు. ఆ ఇద్దరు ఎవరో కూడా ఆయన వెల్లడించారు. “తారక్ అన్న నాకు రెండుసార్లు గిఫ్టులు ఇచ్చారు. బన్నీ ఒకసారి గిఫ్ట్ ఇచ్చాడు” అని అన్నారు.

Advertisement

జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. నాగ వంశీ ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. దేవర.. అరవింద సమేత వీర రాఘవ సినిమాల సమయంలో తారక్ అన్న తనకు గిఫ్టులు ఇచ్చారని చెప్పారు. అలాగే అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ..అల వైకుంఠపురములో సినిమా సమయంలో బన్నీ తనకు ఒక గిఫ్ట్ ఇచ్చారని తెలిపారు. అయితే ఇద్దరూ కూడా వాచ్ లే గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు.

ఈ ఇంటర్వ్యూలో అందరికీ బాగా నచ్చిన విషయం ఏమిటంటే… జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన వాచ్ గురించి నాగ వంశీ చెప్పిన మాటలు. “అరవింద సమేత సినిమా సమయంలో తారక్ అన్న నాకు కొత్త వాచ్ కొనిస్తానన్నారు. కానీ నేను కొత్తది వద్దని చెప్పి, ఆయన చేతిలో ఉన్న వాచ్‌నే అడిగాను. వద్దురా నీకు కొత్తది కొలుస్తాను అన్నారు అయినా కానీ నేను ఒప్పుకోలేదు” అని నాగ వంశీ చెప్పారు.

Advertisement

దానికి యాంకర్, “ఆ వాచ్ ఖరీదైనదా?” అని అడిగితే, నాగ వంశీ.. “ధర విషయం కాదు. అది ప్రేమతో తీసుకున్నది. అది తారక్ అన్న వాచ్ కాబట్టే నాకు విలువైనది” అన్నారు. అంతేకాదు, “నేను అడగగానే తారక్ అన్న ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాచ్ ఇచ్చేశారు” అని చెప్పారు.

చివరిగా..జూనియర్ ఎన్టీఆర్‌పై తన అభిమానమెలా మొదలైందో కూడా నాగ వంశీ వెల్లడించారు. “తారక్ అన్నపై నా అభిమానం ఆది సినిమా నుంచే మొదలైంది” అని చెప్పారు. ఈ మాటలు ఇప్పుడు అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నాయి.

ALSO READ: Naga Vamshi: హడావిడి కాదు.. కంటెంట్ మాట్లాడాలి…అఖిల్ లెనిన్ గురించి నిర్మాత కీలక వ్యాఖ్యలు..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×