// // Naga Shourya Mother : గ్యాస్ కొరతపై నాగశౌర్య తల్లి కామెంట్! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Naga Shourya Mother : గ్యాస్ కొరతతో మూతపడ్డ హోటల్స్.. పొగతో నరకం అంటూ ఉషా పోస్ట్

Naga Shourya Mother : గ్యాస్ కొరతతో మూతపడ్డ హోటల్స్.. పొగతో నరకం అంటూ ఉషా పోస్ట్
Advertisement

Naga Shourya Mother : సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకే రంగాన్ని నమ్ముకోకుండా సినిమా రంగం ద్వారా వచ్చిన ఆదాయాన్ని వివిధ రంగాలలో పెట్టబడులుగా పెడుతూ.. తమ ఆదాయాన్ని పెంచుకుంటూనే.. తమ ఉనికిని విస్తరించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు ఒకవైపు సినిమాలలో చేస్తూనే.. మరొకవైపు సినిమాల ద్వారా వచ్చిన డబ్బును అటు మల్టీప్లెక్స్ లలో ఇటు ఫుడ్డు రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీలు రెస్టారెంట్ బిజినెస్ లపై ఆసక్తి కనబరిస్తున్న విషయం తెలిసిందే.. ఇక వారిలో హీరో నాగశౌర్య తల్లి ప్రముఖ నిర్మాత ఉషా మల్పూరీ కూడా ఒకరు. ఒకవైపు చిత్రాలు నిర్మిస్తూనే మరొకవైపు రెస్టారెంట్లు నిర్వహిస్తూ మరింత బిజీగా మారిపోయారు.

హైదరాబాదులో గ్యాస్ ఇక్కట్లు.. హీరో తల్లి ఆవేదన..

అయితే ఇలాంటి సమయంలో గత కొన్ని వారాలుగా ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నెలకొన్న నేపథ్యంలో వస్తువులు, ఇంధన సరఫరా కొంతమేరా ఆగిపోయింది . ఈ నేపథ్యంలోనే ఇండియాలో గ్యాస్ కొరత ఏర్పడడంతో గ్యాస్ ప్యానిక్ తో లక్షల సిలిండర్లు బుక్ అవడంతో కొన్ని హోటల్స్ గ్యాస్ లేక పూర్తిస్థాయిలో ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాదులో కూడా గ్యాస్ కొరత కారణంగా రెస్టారెంట్ యజమానులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ అందక కొన్ని హోటల్స్ మూతపడగా.. మరికొన్ని కట్టెల పొయ్యిల పైనే వంటలు కానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా హీరో నాగ శౌర్య తల్లి ఉషా మల్పూరీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు.

గ్యాస్ కష్టాలు తీర్చాలంటూ డిమాండ్..

Advertisement

తాజాగా ఉష మల్పూరీ సైతం తన రెస్టారెంట్లో కట్టెల పొయ్యి మీదనే వంటలు చేస్తున్నారు. పొగ వల్ల నానా ఇబ్బందులు పడుతున్నామని ఆమె చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరగా ఈ గ్యాస్ కష్టాలు తొలగిపోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా హైదరాబాదులో ఏర్పడ్డ ఈ గ్యాస్ కొరత హోటల్ యజమానులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే గ్యాస్ కష్టాలను తొలగించాలని సదరు హోటల్స్ యాజమాన్యులు కోరుతున్నారు.. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read:Madhavi Latha: మరో వివాదానికి తెరలేపిన మాధవి లత.. ఈసారి ఏకంగా శ్రీవారి ప్రసాదంపై!

రుచికరమైన వంటకాలకు ఉషా మల్పూరీస్ కిచెన్ ప్రసిద్ధి..

Advertisement

ఉష మల్పూరీ తన పేరు మీదనే “ఉషా మల్పూరీస్ కిచెన్” పేరుతో ఒక రెస్టారెంట్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. రుచికరమైన , నాణ్యమైన ఆహారానికి ఈ రెస్టారెంట్ ప్రసిద్ధి చెందింది.. ముఖ్యంగా తన వంటకాలతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఈమె.. ఇప్పుడు తాజాగా గ్యాస్ కొరత ఏర్పడిందని చెప్పడంతో అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×