E-Paper
Advertisement

నాగశౌర్య ఇక మారడా? ‘బ్యాడ్ బాయ్’తో సెల్ఫ్ గోల్.. కెరీర్ రిస్కులో పడ్డట్టేనా?

నాగశౌర్య ఇక మారడా? ‘బ్యాడ్ బాయ్’తో సెల్ఫ్ గోల్.. కెరీర్ రిస్కులో పడ్డట్టేనా?
Advertisement

Naga Shaurya: నాగశౌర్య… ‘ఊహలు గుసగుసలాడే’అంటూ మొదటి సినిమాతోనే మెప్పించాడు ఈ కుర్ర హీరో. ఇక ఆ తర్వాత  ‘ఛలో’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మాస్, క్లాస్ అని తేడా లేకుండా అందరినీ మెప్పించడంతో ప్రామిసింగ్ హీరోగా స్టాంప్ వేసుకున్నాడు. ఇక ఇతగాడికి తిరుగులేదు అనుకుంటున్న టైమ్ లో కృష్ణ వ్రింద విహారి’,‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ వంటి సినిమలాతో కూల్ గా సాగిపోతున్న కెరీర్ ని డైలమాలో పడేసుకున్నాడు. ఇక ‘రంగబలి’తో కమ్ బ్యాక్ ఇస్తాడనుకుంటే ఆ సినిమా డిజాస్టర్ కొట్టి ఒక్కసారిగా శౌర్య క్రేజ్ ని పాతాళంలో పడేసింది.ఇక అటునుండి కనీసం సినిమా ఈవెంట్లలో కూడా కనిపించకుండా పోయిన శౌర్య, ఇప్పుడు సడన్‌గా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ అంటూ ప్రేక్షకుల ముందుకు ఎంట్రీ ఇచ్చాడు.

also read:హర్ష సాయి ఎక్కడ? గాలిలో దీపంలా ‘మెగా’ సినిమా.. రీల్ దేవుడి రియల్ భాగోతం ఇదేనా?

Advertisement

‘ఛలో’ కాలంలో ఉన్నాడా..

నిజానికి రెండేళ్ల గ్యాప్ తర్వాత ఎలా ఉండాలి. ట్రెండీ సబ్జెక్ట్ తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలి. కాని వదిలిన సినిమా ట్రైలర్ చూస్తుంటే ఈయన గారు ఇంకా ‘ఛలో’ కాలంలో ఉన్నాడా అనిపిస్తుంది. అవును అదే పాత చింతకాయ పచ్చడి మళ్ళీ వేసుకోండి అన్నట్టుగా ముక్కు మొహం తెలియని విలన్లను గాల్లోకి లేపడం,అర్థం పర్థం లేని ఎలివేషన్లతో సరిపెట్టడం చూస్తుంటే శౌర్య స్క్రిప్ట్ సెలక్షన్‌పై మినిమం కేర్ తీసుకున్నాడా లేదా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.

Advertisement

నాసిరకం షార్ట్ ఫిలిం స్థాయి విజువల్స్

చూస్తుంటే డైరెక్టర్  రామ్ కట్ చేసిన ఈ ట్రైలర్‌లో అసలు కథ ఏంటి? హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి? అనే మినిమం క్లారిటీ లేనట్టే కనిపిస్తుంది.‘అశ్వథ్థామ’ లాంటి సీరియస్ అటెంప్ట్ చేసినప్పుడు అయినా కథలో ఒక ఇంటెన్స్ పాయింట్ ఉన్నట్టు కనిపించింది. కానీ ఈ ‘బ్యాడ్ బాయ్’లో అలాంటి ఛాయలేవీ మచ్చుక్కైనా కనిపించకపోవడం గమనార్హం.ఇక హారీష్ జైరాజ్ లాంటి మ్యూజిక్ సెన్సేషన్‌ను, రసూల్ ఎల్లోర్ లాంటి సీనియర్ సినిమాటోగ్రాఫర్‌ను పెట్టుకుని కూడా ఒక నాసిరకం షార్ట్ ఫిలిం స్థాయి విజువల్స్ ఇవ్వడం మరీ విడ్డూరం. ఇక సముద్రఖని,సాయి కుమార్ లాంటి పేరున్న నటులను కేవలం పోస్టర్లకు మాత్రమే పరిమితం చేసినట్లు కనిపిస్తోంది తప్ప, వారి నటనకు తగ్గ స్కోప్ ఉన్నట్లు ఎక్కడా అనిపించడం లేదు.మరోవైపు చూస్తె  సినిమా రిలీజ్ కి  పట్టుమని పది రోజుల టైం కూడా లేదు. గతంలో ‘వరుడు కావలెను’ వంటి సినిమాలకిచేసిన పబ్లిసిటీ హడావిడిలో కనీసం పది శాతం కూడా మేకర్స్ పెట్టకపోవడం ఆశ్చర్యం.

 కుర్ర హీరోలు కొత్త కొత్త కాన్సెప్టులతో దూసుకుపోతుంటే

వాస్తవానికి నాగశౌర్య కెరీర్ కి ఈ సినిమా డూ ఆర్ డై లాంటిది.ఒకవైపు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, రోషన్  లాంటి కుర్ర హీరోలు కొత్త కొత్త కాన్సెప్టులతో దూసుకుపోతుంటే, శౌర్య మాత్రం ఇంకా ఈ ఔట్ డేటెడ్ ‘బ్యాడ్ బాయ్’ వేషాలతో టైం పాస్ చేసుకుపోతున్నాడు. గతంలో పక్కింటి అబ్బాయిలా మెప్పించిన శౌర్య, ఇప్పుడు బలవంతంగా కండలు పెంచి ఊర మాస్ హీరోలా బిల్డప్ ఇస్తుంటే చూడ్డానికి చాలా ఎబ్బెట్టుగా ఉంది.ట్రైలర్ లో రొటీన్ మాస్ ఎలిమెంట్స్ తప్ప వైరల్ అయ్యే ఒక్క సీన్ కూడా లేకుండా చాలా కేర్ ఫుల్ గా ప్లాన్ చేసుకున్నట్టున్నాడు.‘లక్ష్య’ లాంటి స్పోర్ట్స్ డ్రామాలో చూపించిన డెడికేషన్ ఇప్పుడు కనీసం కథల ఎంపికలో చూపిస్తే బాగుండేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయ్. మరి ఈ నెల 17న రాబోతున్ననాగశౌర్య బాక్సాఫీస్ వద్ద ఏదైనా మిరాకిల్ చేస్తాడా లేక  ‘బ్యాడ్ బాయ్’ పేరుతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ‘బ్యాడ్’ మూవీని ఖాతాలో వేసుకుంటాడా? అనేది వేచి చూడాలి.

also read:ఆదిత్య ధర్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ప్రభాస్-సూర్య మల్టీస్టారరా.. లేక రామ్ చరణ్ ‘అశ్వత్థామ’నా? ఫ్యాన్స్‌లో మొదలైన టెన్షన్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×