E-Paper
Advertisement

MissTerious Movie: మిస్టీరియస్ ఓ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ – బ్రహ్మానందం

MissTerious Movie: మిస్టీరియస్ ఓ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ – బ్రహ్మానందం
Advertisement

మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో, అశ్లీ క్రియేషన్స్ బ్యానర్‌పై జయ్ వల్లందాస్ నిర్మిస్తున్న “మిస్టీరియస్” చిత్రం నేడు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అద్భుతంగా నిర్వహించింది.

ఈ సందర్భంగా దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ..“ముందుగా ప్లాన్ చేసిన బడ్జెట్‌ కంటే ఎక్కువైనా, నిర్మాత జయ్ వల్లందాస్ గారు ఎలాంటి రాజీ పడకుండా సినిమా అద్భుతంగా పూర్తయ్యేలా చేశారు. కొత్త తరహా స్క్రీన్‌ప్లే, సస్పెన్స్‌తో నిండి ఉన్న ఈ థ్రిల్లర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది” అని తెలిపారు.

Advertisement

నిర్మాత జయ్ వల్లందాస్ మాట్లాడుతూ..“ మా డైరెక్టర్‌తో కలిసి ఈ మహితో సినిమా చేస్తామనుకోలేదు, కానీ మిస్టీరియస్ కథ విన్న వెంటనే నచ్చింది. కష్టపడి సినిమా చేశాం. మా ఈవెంట్‌కు బ్రహ్మానందం గారు రావడం చాలా సంతోషంగా ఉంది. సెన్సార్ పూర్తయింది, యూ/ఏ సర్టిఫికేట్ లభించింది. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా 150 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం” అని అన్నారు.

సహ నిర్మాతలు ఉషా, శివానీ మాట్లాడుతూ..“సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. టీజర్‌కు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది” అన్నారు.

Advertisement

హీరో రోహిత్ మాట్లాడుతూ..“మా ఈవెంట్‌కు బ్రహ్మానందం గారు రావడం స్పెషల్. సినిమా కోసం అందరం ఎంతో కష్టపడ్డాం. నన్ను ఈ చిత్రానికి ఎంపిక చేసిన మహి సార్‌, జయ్ సార్‌లకు ధన్యవాదాలు” అని తెలిపారు.

ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన బ్రహ్మానందం ఫస్ట్ టికెట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
“ఈ సినిమాలో నేను నటించకపోయినా, దర్శకుడు మహితో ఉన్న పాత స్నేహం కారణంగా వచ్చాను. 1985లో నా మొదటి సినిమా ‘శ్రీ తాతావతరం కథ’లో మహితో కలిసి నటించాం. ఆ స్నేహం నిమిత్తమే ఈ సినిమా టీమ్‌ను ప్రోత్సహించడానికి వచ్చాను. మంచి నటీనటులు, టెక్నికల్ టీంతో సినిమా బాగా చేశారు. టైటిల్ కూడా అద్భుతం. చివరి 20 నిమిషాలు ప్రేక్షకులు స్క్రీన్‌కు కట్టిపడేలా సస్పెన్స్‌ని హ్యాండిల్ చేశారు. సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలి” అంటూ ఆశీర్వచనం అందించారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×