E-Paper
Advertisement

Akhanda 3: అఖండ 3 కన్ఫర్మ్… టైటిల్ లీక్ చేసిన తమన్..

Akhanda 3: అఖండ 3 కన్ఫర్మ్… టైటిల్ లీక్ చేసిన తమన్..
Advertisement

Akhanda 3: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna), బోయపాటి కాంబినేషన్ అంటేనే అభిమానులకు పూనకాలు వస్తాయని చెప్పాలి. అంత అద్భుతంగా వీరిద్దరికి కాంబోలో సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పాలి. ఇప్పటివరకు మూడు సినిమాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ త్వరలోనే అఖండ2 (Akhanda 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే డిసెంబర్ 4నే పెయిడ్ ప్రీమియర్లు కూడా ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

అఖండ 3 కూడా ఉంటుంది..

ఇక ఈ సినిమా విడుదలకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ అన్ని కూడా సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా మంచి కలెక్షన్లను రాబడుతుందన్న ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఆఖండ 3 (Akhanda 3)కూడా ఉండబోతోంది అంటూ పరోక్షంగా తెలియజేశారు. అఖండ 2 క్లైమాక్స్ లో ఎలాంటి అద్భుతాలు అయినా జరగొచ్చు, అఖండ 3 కూడా రావచ్చేమో అంటూ నిర్మాతలు కూడా పరోక్షంగా పార్ట్ 3 గురించి హింట్ ఇచ్చారు.

జై అఖండ..

Advertisement

ఇకపోతే తాజాగా తమన్ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటోలో భాగంగా అఖండ 3 సినిమాకి సంబంధించిన టైటిల్ లీక్ చేశారని అభిమానులు ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు. తమన్ దర్శకుడు బోయపాటితోపాటు ఇతర చిత్ర బృందం కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు ఈ ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో “జై అఖండ”(Jai Akhanda) అని ఉండటంతో ఖచ్చితంగా ఈ టైటిల్ అఖండ 3 టైటిల్ అని అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తూ ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు. మరి నిజంగానే అఖండ 3 టైటిల్ ఇదేనా? కాదా? అనేది తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.

Advertisement

ఇక ఈ టైటిల్ అఖండ 3 అని కాకుండా జై అఖండ అని ఉండటంతో ఈ పార్ట్ 3 లో హనుమంతుడికి సంబంధించిన సన్నివేశాలు ఉండబోతున్నాయా? అందుకే జై అఖండ అని టైటిల్ పెట్టారా? అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సందేహాలకు క్లారిటీ రావాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంటుంది. ఒకవేళ పార్ట్ 3 ఉన్నా ఈ సినిమా రావడానికి మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ వరుస ప్రాజెక్టులకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈయన ఇటీవలే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న NBK 111 సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారు. ఇలా బాలకృష్ణ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాతనే అఖండ 3 ఉంటుందని భావిస్తున్నారు.

Also Read: Allu Arjun- Lokesh Kanagaraj: అల్లు అర్జున్ – లోకేష్ మూవీ అప్డేట్.. సూపర్ హీరో కాన్సెప్ట్.. ఐరెన్ హ్యాండ్‌

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×