E-Paper
Advertisement

Murali Sharma:ఏంటీ.. ఈ లేడీ విలన్, నటుడు మురళి శర్మ భార్యనా, ఎవరూ ఊహించి ఉండరు

Murali Sharma:ఏంటీ.. ఈ లేడీ విలన్, నటుడు మురళి శర్మ భార్యనా, ఎవరూ ఊహించి ఉండరు
Advertisement

Murali Sharma: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో మురళి శర్మ (Murali Sharma)ఒకరు ఈయన పలు సినిమాలలో తండ్రి పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. భలే భలే మగాడివోయ్, అలా వైకుంటపురంలో వంటి సినిమాలలో నటించి నటుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న మురళి శర్మ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన కేవలం వెండి తెరపై మాత్రమే కాకుండా బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఈయన భార్య కూడా ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ బిజీగా ఉన్నారు. మురళి శర్మ భార్య పేరు అశ్విని కల్ శేఖర్ (Aswin kalsekar). ఈమె కూడా పలు తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా వివిధ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

బద్రీనాథ్ సినిమాలో విలన్ భార్య..

ఇక భార్య అశ్విని అంటే ఎవరు గుర్తుపట్టరు కానీ అల్లు అర్జున్ తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన బద్రీనాథ్ సినిమాలో సర్కార్ భార్య అంటే మాత్రం తక్కున ఈమె గుర్తుకు వస్తుంది. ఈ సినిమాలో విలన్ సర్కార్ భార్యగా తన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా తన నటన ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈమె స్వయంగా మురళి శర్మ భార్య అనే విషయం తెలిసిన అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ఇక ఈమె మరాఠీ ఇండస్ట్రీకి సంబంధించినది. కెరీర్ మొదట్లో మరాఠీ సీరియల్స్ లో నటించి అనంతరం హిందీ సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు ఇలా హిందీ సీరియల్స్ లో కూడా నటించి మెప్పించిన ఈమెకు అల్లు అర్జున్ బద్రీనాథ్ సినిమాలో అవకాశం వచ్చింది. అయితే పలు తెలుగు సినిమాలలో అశ్విని కల్ శేఖర్ విలన్ భార్య పాత్రలలో నటించారు.

తండ్రి పాత్రలలో మురళి శర్మ..

Advertisement

ఈమె విలన్ పాత్రలలో హిందీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండగా ఈమె భర్త మురళి శర్మ మాత్రం అచ్చ తెలుగు నటుడిగా పలు తెలుగు సినిమాలలో నటిస్తూ సౌత్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా బిజీగా కొనసాగుతున్నారు. వీరిద్దరూ భార్యాభర్తలు అనే విషయం తెలిసిన అభిమానులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. మురళి శర్మ భలే భలే మగాడివోయ్ సినిమాలో హీరోయిన్ లావణ్య త్రిపాటికి తండ్రి పాత్రలో నటించి మంచి గుర్తింపు పొందారు. ఇక అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ తండ్రి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ పాత్రల ద్వారా ఈయన నటుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తన భార్య అశ్విని ఇద్దరు కూడా కెరియర్ పరంగా ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు.

Also Read: Danush: ఇళయరాజా బయోపిక్ పై రూమర్స్.. ఫేక్ అంటూ ఖండించిన ధనుష్  టీమ్ ..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×