// // MSVPG Box Office 5 Days Gross Collections -->
E-Paper
Advertisement

MSVPG Box Office: 5 రోజుల్లో 200 కోట్ల గ్రాస్… మెగాస్టార్ రికార్డు దూకుడు

MSVPG Box Office: 5 రోజుల్లో 200 కోట్ల గ్రాస్… మెగాస్టార్ రికార్డు దూకుడు
Advertisement

MSVPG Box Office: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమా ‘మన శంకర్ వరప్రసాద్ గారు (MSVPG)’ బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. థియేటర్లలో విజిల్స్, బయట హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన లేటెస్ట్ పోస్టర్‌లో 5 రోజుల్లో 200 కోట్ల గ్రాస్ అని ప్రకటించడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది.

 

Advertisement

ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే ఇండియాలో 100 కోట్ల నెట్ కలెక్షన్ మార్క్‌ను దాటింది. ఇది మెగాస్టార్ స్టామినాకు మరోసారి నిదర్శనంగా నిలిచింది. అదే సమయంలో ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా పోటీ ఇవ్వలేక వెనుకబడిందనే టాక్ వినిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద MSVPG స్పష్టమైన ఆధిక్యం చూపిస్తోంది

 

మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్స్..

Advertisement

 

సినిమా వసూళ్ల వివరాలు చూస్తే… ప్రీమియర్ షోలలోనే ఈ చిత్రం సుమారు రూ. 9.35 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజున రూ. 32.25 కోట్లు, రెండో రోజున రూ. 18.75 కోట్లు, మూడో రోజున రూ. 19.5 కోట్లు వచ్చాయి. నాలుగో రోజైన గురువారం నాడు సుమారు రూ. 22 కోట్లు నెట్ కలెక్షన్ సాధించింది. దీంతో నాలుగు రోజుల మొత్తం ఇండియా నెట్ వసూళ్లు రూ. 101.85 కోట్లకు చేరాయి.

 

మన శంకర వరప్రసాద్ గారి ముందు రాజా సాబ్..

 

ఇదే సమయంలో ‘ది రాజా సాబ్’ నాలుగో రోజు నెట్ కలెక్షన్ ఆరు కోట్ల లోపే ఉండటం గమనార్హం. దీంతో బాక్సాఫీస్ రేస్‌లో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ ముందంజలో ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

 

ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటించగా, వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. కేథరిన్ కీలక పాత్ర పోషించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించారు. సుమారు 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే బడ్జెట్‌లో 50 శాతం కంటే ఎక్కువ రికవరీ చేసింది.

 

విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినా, ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇదే జోరు కొనసాగితే, త్వరలోనే పూర్తి పెట్టుబడిని రికవరీ చేసి మరింత లాభాల్లోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 

Also Read: MSVPG Movie: ఏంటీ.. నయనతారను ఒప్పించడానికి అనిల్ ఇంత కష్టపడ్డారా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×