E-Paper
Advertisement

Mrunal Thakur: ఆ పనిచేయడంతోనే ధనుష్ తో  పెళ్లి రూమర్లు.. ధనుష్ తో సినిమా పై మృణాళ్ క్లారిటీ!

Mrunal Thakur: ఆ పనిచేయడంతోనే ధనుష్ తో  పెళ్లి రూమర్లు.. ధనుష్ తో సినిమా పై మృణాళ్ క్లారిటీ!
Advertisement

Mrunal Thakur: మృణాళ్ ఠాకూర్ ప్రస్తుతం “దో దివానే షెహర్ మే” అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. సిద్ధాంత్ చతుర్వేది మృణాళ్ జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి నేడు (ఫిబ్రవరి 20 న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మృణాళ్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేశారు . ఈ నేపథ్యంలోనే ఈమెకు హీరో ధనుష్ గురించి కూడా ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే మొదటి నుంచి కూడా ఈమె హీరో ధనుష్ విషయంలో వస్తున్న రూమర్లను ఖండిస్తూనే వచ్చినప్పటికీ ఈ రూమర్లకు మాత్రం పులిస్టాప్ పడలేదు.

సన్ ఆఫ్ సర్దార్ 2 స్క్రీనింగ్ కు రావడమే..

ఒక ఇంటర్వ్యూ సందర్భంగా హీరో ధనుష్ తో వస్తున్న రూమర్ల గురించి ఈమె స్పందించారు. నిజానికి తనకు ధనుష్ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని క్లారిటీ ఇచ్చారు అదేవిధంగా తను నాకు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమేనని తెలియజేశారు. అయితే మా ఇద్దరి గురించి ఇలాంటి రూమర్స్ బయటకు రావడానికి కారణం లేకపోలేదు. హీరో ధనుష్ తో కలిసి తాను ఒక సినిమా కూడా నటించలేదు అయినప్పటికీ ధనుష్ నేను నటించిన “సన్ ఆఫ్ సర్దార్ 2” (Son Of Sardar 2)స్క్రీనింగ్ కోసం ఆయన రావటమే కారణమని తెలిపారు. ఈ సినిమా స్క్రీనింగ్ కోసం ధనుష్(Danush) వచ్చినప్పటి నుంచి మా ఇద్దరి గురించి ఇలాంటి పుకార్లు బయటకు వచ్చాయని క్లారిటీ ఇచ్చారు.

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు..

Advertisement

ధనుష్ తనుకు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమేనని, భవిష్యత్తులో ధనుష్ తో సినిమా చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా తనతో కలిసి నటిస్తానని ఈ సందర్భంగా మృణాళ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి తనకు పెళ్లి ఆలోచనలు ఏమాత్రం లేవని తన దృష్టి మొత్తం సినిమాలపైనే ఉంది అంటూ ఈమె మరోసారి హీరో ధనుష్ తో వస్తున్న రూమర్లకు గల కారణాలు ఏంటి అనే విషయాలను తెలియచేస్తూ ఈ రూమర్లను ఖండించారు. ఇక ధనుష్ ఇప్పటివరకు ఈ ఘటనపై ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. వీరిద్దరూ కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

మరోసారి డెకాయిట్ వాయిదా..

Advertisement

మృణాళ్ ఠాకూర్ బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఈమె అడివి శేష్ హీరోగా నటించిన డెకాయిట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మార్చి 19వ తేదీ విడుదల కావాల్సి ఉండగా అదే రోజు పాన్ ఇండియా సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. మరి ఈ సినిమా తదుపరి విడుదల తేదీ ఎప్పుడు ఏంటి అనే విషయాలను మాత్రం చిత్ర బృందం వెల్లడించలేదు. ఇక ఈమె తెలుగులో సీతారామం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈమెకు తదుపరి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి.

Also Read: Mahesh Babu: రాముడిగా మహేష్ బాబు… రాజసం ఉట్టిపడుతోందిగా.. ఫోటో వైరల్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×