E-Paper
Advertisement

Mrunal thakur: దాని కోసం డైరెక్టర్ల వెంట పడక తప్పలేదు..ఊరికే స్టార్లు అయిపోరు: మృణాళ్

Mrunal thakur: దాని కోసం డైరెక్టర్ల వెంట పడక తప్పలేదు..ఊరికే స్టార్లు అయిపోరు: మృణాళ్
Advertisement

Mrunal thakur: సౌత్ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉంటూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో మృణాళ్ ఠాకూర్ ఒకరు. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాలలో కూడా నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక త్వరలోనే ఈమె నటించిన “దో దివానే షెహర్ మే” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 20 వ తేదీ విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మృణాళ్ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవడం గురించి అలాగే కెరియర్ పరంగా ఆమె ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేశారు.

ఊరికే స్టార్ డం ఎవరికి రాదు..

ఈ సందర్భంగా మృణాళ్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో సక్సెస్ కావాలి అంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుందని ఊరికనే ఎవరికి స్టార్ డం రాదని తెలిపారు. తాను కూడా టీవీ నుంచి వెండితెరపై అవకాశాలు అందుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాను ఆఫీసుల చుట్టూ ఆడిషన్స్ కోసం తిరుగుతూ ఉండేదాన్ని ఇక్కడ నేను కూడా ఉన్నాను ఒకసారి ఆడిషన్ చేయండి అంటూ డైరెక్టర్లను బ్రతిమలాడుకునే దాన్ని అంటూ మృణాళ్ తెలిపారు. ఇక సినిమా ఇండస్ట్రీలో మనం మంచి పాత్రలలో నటించాలని కోరుకుంటే అలాంటి పాత్రల కోసం దర్శకుల వెంట పడక తప్పదని, అలా వెళ్లడం తప్పు కూడా కాదని ఈమె తెలిపారు.

దర్శకులను అడగటంలో తప్పులేదు..

Advertisement

మనం దర్శకులను వెళ్లి అడిగినప్పుడే మనలో ఉన్న ఆకలి వాళ్ళకి తెలిసి మనకోసం సరికొత్త పాత్రలను తీర్చిదిద్దుతారని తెలిపారు. నిజానికి నాకు ఈ సినిమాలో అవకాశం కూడా అలాగే వచ్చిందని తెలిపారు. తాను డైరెక్టర్ రవి ఉద్యవర్ దర్శకత్వంలో వచ్చిన మామ్ సినిమా చూస్తున్న తర్వాత ఆయనతో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఆక్షణమే తాను రవి గారి వద్దకు వెళ్లి సర్ మనం సినిమా ఎప్పుడు చేస్తున్నాం అంటూ ఆయనని అడిగానని మృణాళ్ ఠాకూర్ తెలిపారు. ఈ విధంగా సినిమాలలో మంచి పాత్రలు రావాలి అంటే దర్శకుల వెంట పడాల్సిందే అంటూ ఈమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

విడుదలకు సిద్ధంగా డెకాయిట్…

Advertisement

ఇక దో దివానే షెహర్ మే సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో మృణాళ్ జోడిగా సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటించగా సంజయ్ లీలా భన్సాలీ నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు. ఇక మృణాళ్ ఈ సినిమాతో పాటు తెలుగులో అడవి శేష్ హీరోగా నటించిన డెకాయిట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

Also Read: Sridevi: రాజమ్మగా శ్రీదేవి.. బ్యాండ్ మేళం నుంచి స్పెషల్ వీడియో రిలీజ్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×