E-Paper
Advertisement

Bandi Saroj: నా కళ్ళముందే అది జరిగింది.. క్షమాపణలు చెప్పిన బండి సరోజ్!

Bandi Saroj: నా కళ్ళముందే అది జరిగింది.. క్షమాపణలు చెప్పిన బండి సరోజ్!
Advertisement

Bandi Saroj: బండి సరోజ్ పరిచయం అవసరం లేని పేరు. తాజాగా బండి సరోజ్(Bandi Saroj) వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈయన నటించిన మోగ్లీ (Mowgli) సినిమా వేడుకలో భాగంగా సెన్సార్ బోర్డు గురించి మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర దమారం రేపుతున్నాయి. ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు కానీ సెన్సార్ బోర్డు వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇందులో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు ఉండవు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు కూడా భయపడింది అంటూ ఈయన మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త వివాదానికి కారణమయ్యాయి. బండి సరోజ్ సెన్సార్ బోర్డు గురించి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో చివరికి మోగ్లీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సెన్సార్ బోర్డుకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.

నిర్మాతలు భారీగా డబ్బు ఖర్చు చేశారు..

ఈ విధంగా నిర్మాణ సంస్థ బండి సరోజ్ వ్యాఖ్యలకు సెన్సార్ బోర్డు వారికి క్షమాపణలు చెప్పడంతో తాజాగా బండి సరోజ్ కూడా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు తెలియజేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఈయన స్పందిస్తూ.. మోగ్లీ సినిమాని నా బాధ్యతగా తీసుకున్నాను. నిర్మాతలు నా కళ్ళముందే డబ్బును భారీగా ఖర్చు పెట్టడం చూశాను దానికి నా వంతు కృషిగా నా సొంత సినిమా కంటే గట్టిగా, నా ఇంట్రో వర్ట్ బిహేవియర్ నుండి బయటకు వచ్చి ఆలౌట్ ప్రమోషన్స్ చేశాను.

సెన్సార్ బోర్డుకు క్షమాపణలు..

Advertisement

సెన్సార్ బోర్డు వాళ్ళు క్షమాపణ కావాలి అన్న డిమాండ్ సినిమాకు ఆటంకం కలుగకుండా ఉండడం కోసం నెరవేర్చాను. నేడే ప్రీమియర్లు ఒరిజినల్ రివ్యూస్ ప్రేక్షకులు ఇస్తారు అక్కడి నుండి ఆ సినిమా కంటెంట్ ఏ సినిమాని ముందుకు తీసుకెళ్లాలి. ఇంతటితో నా పని పూర్తి అయింది సినిమా చూశాక నచ్చితే గట్టిగా ముందుకు తీసుకెళ్లండి అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు అలాగే ఒక వీడియోని కూడా విడుదల చేశారు. నేను అలా మాట్లాడి ఉండకూడదు ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు అంటూ సారీ చెబుతూ ఒక వీడియోని కూడా షేర్ చేశారు.

Advertisement

ఇలా బండి సరోజ్ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదానికి చెక్ పెట్టినట్టు అయింది. ఇక బండి సరోజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. సందీప్ రాజ్ (Sandeep Raj)దర్శకత్వంలో రోషన్ కనకాల(Roshan Kanakal) హీరోగా నటించిన ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఒక లవ్ స్టోరీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలనే పెంచేసాయి. ఇక ఈ సినిమాలో బండి సరోజ్ విలన్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా నేడే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా నేను అఖండ 2 విడుదలవుతున్న నేపథ్యంలో నేడు సాయంత్రం ప్రీమియర్లు ప్రసారమౌతూ రేపు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read: Thiruveer: తండ్రైన టాలీవుడ్ హీరో.. ఫోటో చూశారా ఎంత క్యూట్ గా ఉందో!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×