E-Paper
Advertisement

Actress Vahini: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. నటి వాహిని కన్నుమూత..

Actress Vahini: టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. నటి వాహిని కన్నుమూత..
Advertisement

Actress Vahini: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది.. సీనియర్ నటి వాసవి (పద్మ) అనారోగ్యంతో కన్నుమూశారు… గత కొన్ని రోజులుగా ఈ నటి క్యాన్సర్ తో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఆర్థిక పరిస్థితి బాగో లేకపోవడంతో ఆమె అనారోగ్యానికి ఆర్థిక సాయం కోసం సినీ నటి కళ్యాణి ఆ మధ్య పోస్టు పెట్టింది.. ఆమె ను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేసినా సరే పెద్దగా ఫలించలేదు అని కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.. ఆమె చనిపోయిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ వార్తతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. గొప్ప నటిని మిస్ అయినట్లు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెడుతున్నారు.. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఆమెకు నివాళులర్పించారు.. నేడు విజయనగరంలోనే ఆమె అంత్యక్రియలు జరగనున్నాయని సమాచారం.. ఈ కార్యక్రమానికి సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు బంధువులు హాజరుకానున్నట్లు తెలుస్తుంది.

క్యాన్సర్ తో పోరాడుతూ నటి మృతి.. 

గత కొన్నేళ్లుగా రొమ్ము క్యాన్సర్‌తో పోరాటం చేస్తున్న వాహిని.. కొంతకాలంగా ఈమె నటనకు దూరంగా ఉంటున్నారు. చివరగా ఆమె ‘బహిర్భూమి’ అనే సినిమాలో కనిపించారు.. ఆ తర్వాత పలు సీరియల్స్లలో నటించింది. ఈమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె అనారోగ్య సమస్యలతో పోరాడుతూ ఉంది. ఆర్థిక సాయం కోసం ప్రయత్నించారు కానీ ఆమె ప్రాణాలను మాత్రం కాపాడుకోలేకపోయారు.. క్యాన్సర్ తో పోరాడుతూ నటి మృతి చెందిందన్న వార్త తెలియడంతో పలువురు సినీ నటులు, ప్రముఖులు ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.. ప్రస్తుతం కరాటే కళ్యాణి పోస్ట్ వైరల్ గా మారింది.

కరాటే కళ్యాణి ఎమోషనల్ పోస్ట్.. 

Advertisement

నటి పద్మక్క అలియాస్ వాహిని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. 1978లో విజయనగరంలో జన్మించింది.. ఆ తర్వాత టీవీలో సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకుల మనసు దోచుకుంది.. ఈమె ఇటీవల రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న విషయాన్ని సినీనటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. అయితే ఆ పోస్ట్ చేసిన కొన్ని రోజులకే ఆమె క్యాన్సర్ తో పోరాడుతూ మృతి చెందడంతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయాన్ని నటి కరాటే కళ్యాణి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది. ఆమె చేసిన పోస్ట్ లో ఏముందంటే.. వాహిని అక్కా(పద్మక్క).. నేను నిన్ను కాపాడాలి అని చాలా ప్రయత్నం చేశాను. కొద్దిసేపటి క్రితం తన జన్మస్థలం అయిన విజయనగరంలో స్వామిని చేరుకుంది. మొన్న చెప్పేశారు ఇక కష్టం అని, ఊరికి తీసుకువెళ్ళిపోయారు. ఆమె పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.. సద్గతి ఓం శాంతి. మేము నిన్ను ఎంతో మిస్ అవుతున్నాం పద్మక్క. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.. అంటూ ఆమె తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.. అది కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది..

https://www.facebook.com/share/p/17QsvcvrvG/

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×