E-Paper
Advertisement

Monalisa Father: మోనాలిసా పెళ్లిపై తండ్రి కీలక వ్యాఖ్యలు.. అల్లుడి గురించి విస్తుపోయే నిజాలు!

Monalisa Father: మోనాలిసా పెళ్లిపై తండ్రి కీలక వ్యాఖ్యలు.. అల్లుడి గురించి విస్తుపోయే నిజాలు!
Advertisement

Monalisa Father:మహా కుంభమేళాలో తన తేనెకళ్ళతో అందరినీ మాయ చేసిన మోనాలిసా(Monalisa ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు . అదృష్టం వరిస్తే ఓవర్ నైట్ లోనే స్టార్ అవ్వచ్చు అని ఈమె నిరూపించింది. అలాంటి ఈమె పూసలమ్ముతూ ఒక్కసారిగా వైరల్ అయిపోయింది. మధ్యప్రదేశ్ కి చెందిన మోనాలిసా క్రేజ్ చూసి చాలా మంది దర్శక నిర్మాతలు ఈమెతో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు. అయితే అందరికీ షాక్ ఇస్తూ మోనాలిసా ఇటీవల కేరళలో వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా తన కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా ఫర్మాన్ ఖాన్ అనే ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.

కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా మోనాలిసా పెళ్లి..

ఇకపోతే తన కుటుంబ సభ్యుల వల్లే తనకు హాని ఉందని, తన పెళ్లికి తన కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని కేరళ కోర్టు మెట్లు ఎక్కిన ఈమె అక్కడే కొంతమంది రాజకీయ నాయకుల సమక్షంలో వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కొంతమంది మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ వివాహాన్ని ‘లవ్ జిహాద్’ అని కూడా పిలుస్తున్నారు. అయితే ఈ నూతన వధూవరులు ఇద్దరూ దీనిని ఖండించారు. తమకు అన్ని మతాలు సమానమేనని కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా మోనాలిసా తండ్రి జయ సింగ్ భోంస్లే మోనాలిసా ప్రేమ వివాహంపై స్పందించారు.

కూతురి పెళ్లిపై తండ్రి వ్యాఖ్యలు..

Advertisement

జయ సింగ్ భోంస్లే మాట్లాడుతూ.. మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ లు వివాహం చేసుకుంటామని నాతో చెప్పారు. అయితే నేను అభ్యంతరం చెప్పి, మోనాలిసాను తన ప్రియుడిని మా సొంత ఊరికి రమ్మని అడిగాను. కానీ వారు కేరళ పోలీస్ స్టేషన్ కి వెళ్లి రక్షణ కోరారు. మోనాలిసాకు ఇప్పటికే 18 సంవత్సరాలు.. కాబట్టి తనకు నచ్చిన వారిని వివాహం చేసుకోమని కేరళ పోలీసులు కూడా ఆమెకు సపోర్ట్ ఇచ్చారు. దీంతో మేమేం చేయలేకపోయాము. కొంతమంది అవకాశం కోసం నా కూతుర్ని కేరళ పిలిపించుకున్నారు. మేము పెద్దగా చదువుకున్న వాళ్ళం కాదు.. అయితే ఇదంతా ఎలా జరిగిందో కూడా మాకు అర్థం కావడం లేదు.. ఎవరైనా నా కూతుర్ని ప్రభావితం చేసి ఉండవచ్చు.. ఆమె నిర్ణయాన్ని అంగీకరించడం తప్ప మాకు వేరే మార్గం లేదు. మాకు ముందే అన్నీ చెప్పి ఉంటే మేమే వారి పెళ్లి చేసేవాళ్లం “అంటూ మోనాలిసా తండ్రి తెలిపారు.

ALSO READ:Celebrities Alimony: సినిమా ఇండస్ట్రీలో భరణం ఆశించకుండా విడిపోయిన సెలబ్రెటీస్ వీరే!

అల్లుడి గురించి విస్తుపోయే నిజాలు..

Advertisement

ఇకపోతే ఫర్మాన్ ఖాన్ గురించి చెబుతూ కొన్ని రోజుల క్రితం కొంతమంది మా ఇంటికి వచ్చారు. నటనలో శిక్షణ పనుల కోసం మోనాలిసాను తమతో పాటు కేరళకు పంపమని అడిగారు. ఇలాంటి విషయాలు పెద్దగా నాకు తెలియక అంగీకరించాను. అయితే మోనాలిసా తో పాటు నేను కూడా కేరళ వెళ్లాను. మోనాలిసాని నమ్మించి మోసం చేశారేమో అని నేను అనుకుంటున్నాను. అయితే మోనాలిసాను తమతో పాటు తీసుకువెళ్లడానికి వచ్చిన వారిలో ఫర్మాన్ ఖాన్ కూడా ఉన్నారు” అంటూ ఆయన తెలిపారు. మొత్తానికైతే కావాలనే ఆమెను తీసుకెళ్లి ఆమెను ఒప్పించి ఈ పెళ్లి చేసుకున్నారని మోనాలిసా తండ్రి తెలిపారు .

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×