E-Paper
Advertisement

Monalisa Bhosle: మోనాలిసాకు బిగ్ షాక్… ఫర్మాన్ ఖాన్ తో పెళ్లి చెల్లదంటూ!

Monalisa Bhosle: మోనాలిసాకు బిగ్ షాక్… ఫర్మాన్ ఖాన్ తో పెళ్లి చెల్లదంటూ!
Advertisement

Monalisa Bhosle: ప్రయాగ్ రాజ్ కుంభమేళా ద్వారా రాత్రికి రాత్రే సంచలనగా మారిన మోనాలిసా భోంస్లే గత కొద్దిరోజులుగా తన పెళ్లి విషయంలో వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినప్పటికీ తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే .ఈమె వివాహం లవ్ జిహాద్ అంటూ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇలా మోనాలిసా పెళ్లి చేసుకోవడంతో ఈమె పెళ్ళికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు ప్రస్తుతం బయటకు వస్తున్నాయి.
మోనాలిసా తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరుపుకున్నారు.

సీఎం దృష్టికి మోనాలిసా పెళ్లి వివాదం..

ఇలా ఈమె పెళ్లి పట్ల తన తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తన కుమార్తెకు మత్తుమందు ఇచ్చి పెళ్లి చేసుకున్నారు అంటూ మోనాలిసా తండ్రి ఆరోపణలు చేశారు. ఈ విషయం ఏకంగా మహారాష్ట్ర సీఎం దృష్టికి కూడా వెళ్ళింది. మోనాలిసాకు ఇష్టం లేకపోయిన బలవంతంగా ఈ వివాహం జరిగింది అంటూ కుటుంబ సభ్యులు ఆరోపణలు చేసినప్పటికీ మోనాలిసా మాత్రం ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని తెలిపారు. తమ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదని ఈమె తమకు రక్షణ కల్పించాలి అంటూ పోలీసులను కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే.

మోనాలిసా మైనర్.. పెళ్లి చెల్లదు

Advertisement

కేరళ పోలీస్ స్టేషన్ లో మోనాలిసా రక్షణ కోరుతూ ఫిర్యాదు చేయడమే కాకుండా కేరళలోని ఒక ఆలయంలో హిందూ సంప్రదాయాల ప్రకారం పలువురు రాజకీయ నాయకుల సమక్షంలో వివాహం జరుపుకున్నారు. అయితే తాజాగా మోనాలిసా బాబాయ్ విజయ్ భోంస్లే ఈమె పెళ్లి గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. మోనాలిసా ఫర్మాన్ ఖాన్ వివాహం చెల్లదంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మోనాలిసా 2009వ సంవత్సరంలో జన్మించింది. ఈ ప్రకారం ఈమె వయసు 17 సంవత్సమాత్రమే . ఇంకా మోనాలిసా మైనర్ కావడంతో ఈ పెళ్లి చెల్లదని తెలిపారు. కేవలం పాస్ పోర్ట్ లో తన వయసు పెంచి చూపించారని ఫర్మాన్ ఖాన్ తో ఆమె వివాహం చట్టబద్ధం కాదని ఆయన పేర్కొన్నారు.

విలన్ పాత్రలో ఫర్మాన్ ఖాన్..

Advertisement

ఇలా మోనాలిసా మేజర్ కాకముందే పెళ్లి చేసుకోవడంతో ఈమె పెళ్లి చిక్కుల్లో పడిందనే చెప్పాలి అయితే ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ సీఎం దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పడంతో ఈ విషయం కాస్త చర్చలకు కారణమైంది . మరి తన బాబాయ్ చేస్తున్న వ్యాఖ్యలపై మోనాలిసా స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది. మోనాలిసా తన సహా నటుడితో గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ మలయాళంలో తెరకెక్కిన నాగమ్మ అనే సినిమాలో నటించారు. ఇందులో మోనాలిసా ప్రధాన పాత్రలో నటించగా ఫర్మాన్ ఖాన్ విలన్ గా నటించారు. సోషల్ మీడియా ద్వారా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటంతో పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది.

Also Read: Vrushakarma movie: అక్కినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వృషకర్మ సీక్వెల్ పై చైతూ బిగ్ అప్డేట్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×