E-Paper
Advertisement

Sravanthi Chokkarapu: అమ్మ చనిపోయింది.. ఎవరు లేని దాన్ని అయిపోయా.. ఎమోషనల్ అయినా స్రవంతి చొక్కారపు..!

Sravanthi Chokkarapu: అమ్మ చనిపోయింది.. ఎవరు లేని దాన్ని అయిపోయా.. ఎమోషనల్ అయినా స్రవంతి చొక్కారపు..!
Advertisement

Sravanthi Chokkarapu:  యాంకర్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్రవంతి చొక్కారపు తన జీవితంలో ఎదురైన కష్టాల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చాలా ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ ద్వారా, అలాగే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ల ద్వారా మంచి పేరు తెచ్చుకున్న స్రవంతి..ఈ మధ్య సుహాస్ హీరోగా వచ్చిన హే బలవంత్ సినిమాలో వెన్నెల కిషోర్ పక్కన ముఖ్యమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

కెరియర్ అలానే మొదలు..!

స్రవంతి కెరీర్ మొదట్లో యూట్యూబ్ ద్వారా కొంత గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగులో పాల్గొనడంతో ఆమె పేరు బాగా వినిపించింది. ప్రస్తుతం మాత్రం ఆమెకు వరుసగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ఆమెను, “మీ జీవితంలో ఎదురైన కష్టాలు ఏమిటి? ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎలా ముందుకు వచ్చారు?” అని ప్రశ్నించారు.

ఎమోషనల్ అయినా స్రవంతి..!

Advertisement

ఆ ప్రశ్న విన్న వెంటనే స్రవంతి ఎమోషనల్ అయింది. తన జీవితంలో జరిగిన పెద్ద నష్టాన్ని గుర్తు చేసుకుంది. “దాదాపు 2014లో అమ్మ చనిపోయింది. అంతకుముందు అమ్మే నాకు అన్నీ. ఏ పని చేసినా ఆమె సలహాలు ఉండేవి. నాకు ఆమె చాలా స్ట్రెంత్,” అని చెప్పింది. కానీ తల్లి చనిపోయిన తర్వాత మాత్రం అన్నీ తానే చూసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.

అమ్మ లేని లోటు చాలా బాధగా అనిపించినా..తన అమ్మఇచ్చిన ధైర్యమే తనను ముందుకు నడిపిందని స్రవంతి చెప్పింది. “ ఆమె మాటలు ఎప్పుడూ నాకు గుర్తుండేవి. ఆ ధైర్యంతోనే అన్ని కష్టాలు ఎదుర్కొంటూ ముందుకు సాగాను,” అని చెప్పింది. ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ స్థాయిలో కూర్చొని మాట్లాడగలుగుతున్నానని భావోద్వేగంగా తెలిపింది.

Advertisement

ఇక భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి అడిగితే, తాను ప్రత్యేకంగా ఏదీ ప్లాన్ చేయలేదని స్రవంతి చెప్పింది. “వచ్చే అవకాశాల ఫ్లోతోనే వెళ్లిపోతాను,” అని సింపుల్‌గా సమాధానం ఇచ్చింది.

స్రవంతి చొక్కారపు జీవిత ప్రయాణం వెనుక ఎంతో కష్టం, ధైర్యం, అమ్మ జ్ఞాపకాలే ఉన్నాయని ఈ ఇంటర్వ్యూలో స్పష్టంగా తెలిపింది ఈ యాంకర్.

ALSO READ: Actress Suhashini : నటి సుహాసిని సినిమాల్లోకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×