E-Paper
Advertisement

Mohan Babu: బావ నువ్వు పెళ్లి చేసుకుని అర డజను మంది పిల్లలతో సంతోషంగా ఉండాలి!

Mohan Babu: బావ నువ్వు పెళ్లి చేసుకుని అర డజను మంది పిల్లలతో సంతోషంగా ఉండాలి!
Advertisement

Mohan Babu: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ట్ ప్రభాస్ (Prabhas)నేడు తన పుట్టినరోజు(Birthday) వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి. సినిమా సెలబ్రిటీల నుంచి మొదలుకొని అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ తో వారికున్న అనుబంధాన్ని షేర్ చేస్తూ.. ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల నుంచి కూడా మేకర్స్ వరుసగా అప్డేట్స్ విడుదల చేస్తున్నారు.

త్వరగా పెళ్లి చేసుకో బావ..

ఇదిలా ఉండగా ప్రభాస్ కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) సైతం సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఈయన చేసిన బర్త్ డే విషెస్ మాత్రం అందరిని ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఈ సందర్భంగా మోహన్ బాబు తన ఎక్స్ ఖాతా ద్వారా కన్నప్ప(Kannappa) సినిమా షూటింగ్లో భాగంగా దిగిన ఒక ఫోటోని షేర్ చేస్తూ..” మై డియర్ డార్లింగ్ బావా ప్రభాస్, నువ్వు సినీ ఇండస్ట్రీకి గర్వకారణం, నీకు ఎల్లప్పుడూ ఎంతో సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. ఇలాగే మరెన్నో పుట్టినరోజులను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని, అలాగే నీకు త్వరగా పెళ్లి అయ్యి అరడజను మంది పిల్లలతో నీ జీవితంలో సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు నిన్ను ఎల్లప్పుడూ ప్రేమించే మీ బావ” అంటూ మోహన్ బాబు చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

బుజ్జిగాడు సినిమాలో బావగా..

Advertisement

మోహన్ బాబు ప్రభాస్ ను బావ అంటూ సంబోధించడమే కాకుండా త్వరగా పెళ్లి చేసుకోవాలని సూచించడంతో ఈ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఇక వీరిద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ సరదాగా ఒకరినొకరు బావ అంటూ పిలుచుకుంటారు. ప్రభాస్ హీరోగా బుజ్జిగాడు సినిమాలో నటించగా ఇందులో హీరోయిన్ త్రిషకు అన్నయ్య పాత్రలో మోహన్ బాబు నటించారు. ఈ సినిమా సమయం నుంచి వీరిద్దరూ బావ అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇలా మోహన్ బాబు త్వరగా పెళ్లి చేసుకోవాలని కోరడంతో అభిమానులు కూడా పెళ్లి గురించి ప్రభాస్ గుడ్ నైట్ త్వరగా చెప్పాలని కోరుకుంటున్నారు.44 సంవత్సరాల వయసు ఉన్న ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉండడంతో తరచూ ఈయన పెళ్లికి సంబంధించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి కూడా ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడుతూ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని చెబుతూనే ఉన్నారు తప్ప ఆ శుభవార్తను మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. దీంతో ప్రభాస్ పెళ్లి విషయంలో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన ఐదు పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Also Read: The Raja Saab: అనుకున్నట్టే చేశాడు.. రాజా సాబ్‌పై మారుతిపై ఫ్యాన్స్ ఫైర్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×