E-Paper
Advertisement

Mohan Babu: ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న మోహన్ బాబు.. తొలి తెలుగు నటుడిగా గుర్తింపు!

Mohan Babu: ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న మోహన్ బాబు.. తొలి తెలుగు నటుడిగా గుర్తింపు!
Advertisement

Mohan Babu: టాలీవుడ్ స్టార్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలలో నటించిన మోహన్ బాబు అనంతరం విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. హీరోగా నిర్మాతగా కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు ప్రఖ్యాతలను, అభిమానులను సొంతం చేసుకున్నారు. మోహన్ బాబు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 50 సంవత్సరాల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్నారు.

ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న మోహన్ బాబు..

ఈ 50 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఈయన ఎన్నో పురస్కారాలను గౌరవాలను అందుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా మోహన్ బాబుకు మరొక గౌరవం లభించింది. ఈయన 50 సంవత్సరాల సినీ ప్రయాణం పూర్తి కావడంతో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎక్సలెన్స్(Governor excellence) అవార్డుకు ఎంపిక అయ్యారు. ఇక రిపబ్లిక్ డే ను పురస్కరించుకొని జనవరి 26వ తేదీ ఈ పురస్కారాన్ని మోహన్ బాబు అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కలకత్తాలోని లోక్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా మోహన్ బాబు కలకత్తా గవర్నర్ బోస్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మోహన్ బాబుతో పాటు ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు(Manchu Vishnu)తో పాటు మరొక నటుడు శివ బాలాజీ కూడా ఉన్నారు.

పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎక్స లెన్స్ అవార్డు ..

Advertisement

ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో పలువురు హీరోలకు ఎన్నో పురస్కారాలు లభించిన ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎక్స లెన్స్ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా మోహన్ బాబు గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా మోహన్ బాబు ఈ పురస్కారాన్ని అందుకోవడంతో ఆయన అభిమానులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా మోహన్ బాబుకు అభినందనలు తెలియజేస్తున్నారు.

నాని సినిమాలో విలన్ గా మోహన్ బాబు…

Advertisement

ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోని మంచు విష్ణు తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ.. మై లయన్ కింగ్ రిసీవింగ్ ద గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డు అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.. ఇక మోహన్ బాబు సినీ కెరియర్ విషయానికి వస్తే ఇటీవల పలు సినిమాలలో ఈయన కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమాలో మోహన్ బాబు నటించిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటిస్తున్న ది ప్యారడైజ్(The Paradise) సినిమాలో మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో మోహన్ బాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయగా అమాంతం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఇలా విభిన్నమైన కీలక పాత్రలలో నటిస్తూ మోహన్ బాబు బిజీగా గడుపుతున్నారు.

Also Read: Ranabaali Movie: ‘రణబాలి’ గా విజయ్ దేవరకొండ మూవీ.. గ్లింప్స్ తోనే  ఫ్యాన్స్ ఆకలి తీర్చిన డైరెక్టర్?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×