E-Paper
Advertisement

Chiranjeevi: మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. అన్నీ శుభాలే..చిరు ఇంట్రెస్టింగ్ పోస్ట్!

Chiranjeevi: మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. అన్నీ శుభాలే..చిరు ఇంట్రెస్టింగ్ పోస్ట్!
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబి సినిమా పనులలో బిజీగా ఉన్నారని తెలుస్తుంది.. ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలో బాబి డైరెక్షన్లో రాబోతున్న సినిమా పనులలో చిరంజీవి బిజీ కాబోతున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి తన అధికారిక ఎక్స్ కథ ద్వారా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh)సినిమా ట్రైలర్ గురించి స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల పవన్ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కాగా ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంది.

 “ఉస్తాద్ భగత్ సింగ్” తో అన్ని శుభాలే!

ఈ నేపథ్యంలోనే చిరంజీవి(Chiranjeevi) ఈ ట్రైలర్ వీడియోను తన ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. మ్యాజిక్ జరిగింది.. ముహూర్తం కుదిరింది.. ట్రైలర్ అదిరింది.. ఉగాదికి “ఉస్తాద్ భగత్ సింగ్” తో అన్ని శుభాలే!! అంటూ ఈయన పోస్ట్ చేయడమే కాకుండా కళ్యాణ్ బాబు, హరి శంకర్ అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ టీం అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా ఈ సినిమా ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar)స్పందించారు.

మెగా ఆశీర్వాదం దొరికింది..

Advertisement

ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ చిరంజీవి చేసిన పోస్ట్ కు రిప్లై ఇస్తూ.. అయ్య బాబోయ్.. అన్నయ్య!! మీ టైమింగ్, రైమింగ్ చూస్తుంటే మీకు ట్రైలర్ ఏ రేంజ్ లో నచ్చిందో నాకు అర్థం అవుతుంది. మీరు అవుట్ ఆఫ్ కంట్రీ లో ఉన్నారని తెలిసింది. అయినా సరే వీలు చూసుకుని మా ట్రైలర్ చూసి అభినందనలు తెలిపినందుకు నా ఆనందానికి అవధులు లేవు. మెగా ఆశీర్వాదం కూడా దొరికింది అంటూ హరీష్ శంకర్ చిరంజీవి చేసిన పోస్ట్ కు రిప్లై ఇస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

పవన్ కళ్యాణ్ సినిమా ట్రైలర్ కు చిరంజీవి అభినందనలు తెలుపుతూ పోస్ట్ చేయడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమాపై అభిమానులలో పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి.  హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కాంబినేషన్లో గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మరి గబ్బర్ సింగ్ తరహాలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి సక్సెస్ అందుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే మరొక మూడు రోజులు ఎదురు చూడాల్సిందే.

Also Read: Allu Arjun: అల్లు అరవింద్ ఇంటికి ఏపీ సీఎం..క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్..పోస్ట్ వైరల్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×