// // Chiranjeevi: ఎన్టీఆర్ అంటే ఏంటో చెప్పేసిన మెగాస్టార్.. -->
E-Paper
Advertisement

Chiranjeevi: ఎన్టీఆర్ అంటే ఏంటో చెప్పేసిన మెగాస్టార్.. మరిచిపోయినా మస్త్ కవర్ చేశారుగా!

Chiranjeevi: ఎన్టీఆర్ అంటే ఏంటో చెప్పేసిన మెగాస్టార్.. మరిచిపోయినా మస్త్ కవర్ చేశారుగా!
Advertisement

Chiranjeevi: సభా సమయం మించి పోతున్న సమయంలో కొందరు షార్ట్ స్పీచ్‌లతోనే ముగించాల్సి వస్తుంది. అందులోనూ అధికారులు ఉన్నప్పుడు, ఇంకాస్త తొందర పెడుతుంటారు. ఆ క్రమంలో చెప్పాలనుకున్న నాలుగు ముక్కలు కూడా ఏదేదో చెప్పేసి స్టేజ్ దిగిపోతుంటారు. కొందరికి అయితే అసలు మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు. ఇదే జరిగింది గురువారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌ (Telangana Gaddar Film Awards)లో. ఈ అవార్డ్స్ వేదికపై మాట్లాడాలని చాలా మంది అనుకుంటారు. కానీ, అక్కడ కొందరికే అవకాశం ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), కమల్ హాసన్, ఆర్ నారాయణ మూర్తి వంటి వారికి కాస్త ఎక్కువ సేపు మాట్లాడటానికి సమయమైతే లభించింది కానీ, అప్పటికే చాలా సమయం గడిచిపోయింది. అందుకే చిరంజీవి కూడా త్వరత్వరగానే తన స్పీచ్‌ని ముగించారు. ఈ క్రమంలో ఆయన తను అందుకున్న అవార్డ్ గురించి చెప్పడం మరిచిపోయారు.

Also Read- Rashmika Mandanna: ఈ అనుభూతిని వర్ణించలేను.. ఇది ఆరంభం మాత్రమే!

సీనియర్స్‌కు ఇచ్చే గౌరవం

Advertisement

అందుకే అవార్డు అందుకుని ఇంటికి వెళ్లిపోయిన తర్వాత తను అందుకున్న అవార్డు గురించి, ఆ అవార్డు ఎవరి పేరు మీద అయితే ఇచ్చారో, ఆ పేరు గల వ్యక్తి గురించి సోషల్ మీడియా వేదికగా తన మనసులోని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనినే యాంటీ ఫ్యాన్స్ బాగానే కవర్ చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారనుకోండి. అయితే సరే, ఇలా చెప్పడం కూడా గొప్ప విషయమే. అవార్డు తీసుకున్నాం కదా.. ఇంకేముందిలే అని చాలా మంది కామ్ అయిపోతారు. కానీ అక్కడుంది చిరంజీవి (Chiranjeevi). అందుకే సోషల్ మీడియా వేదికగా తనకిచ్చిన ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వాస్తవానికి అవార్డుని అందుకున్న అనంతరం మాట్లాడిన స్పీచ్‌లో కూడా.. ‘ఇది సీనియర్స్‌కు గౌరవం ఇచ్చే విధంగానూ, అలాగే యంగ్ స్టర్స్‌ను ఉత్సాహ పరిచే విధంగానూ, చాలా చక్కగా ఈ అవార్డుల ఎంపిక జరిగింది’ అని ఒక్క మాటలోనే అన్నీ కవర్ చేశారు. అయినా సరే సంతృప్తి చెందని చిరంజీవి.. ఎక్స్ వేదికగా తనకు వచ్చిన అవార్డుపై ఓ పోస్ట్ చేశారు.

Also Read- Mallishwari: బాహుబలి కంటే 60 ఏళ్ల ముందే చైనాను ఏలిన తెలుగు సినిమా!

ఎన్టీఆర్ అంటే..

Advertisement

‘‘చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు.. తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు. ఎన్టీఆర్ అంటే… N నాట్యం, T తాళం, R రాగం… కళల సమ్మేళనం. తెలుగు సినిమాకు ఉన్న కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహానుభావుడు. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా… ఆయన పోషించిన పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభ. రామారావు గారు జన్మించిందే సినిమాల కోసం అన్నట్టుగా, ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిది. అలాంటి మహానుభావుని పేరుతో ఉన్న ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ నాకు లభించడం, నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’’ అని మెగాస్టార్ చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Also Read- Niharika Konidela: విడాకుల తర్వాత జీవితం పై నిహారిక కామెంట్స్.. ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉన్నారా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×