E-Paper
Advertisement

The Raja Saab: ది రాజా సాబ్ వల్ల లాభ పడింది ఇద్దరే.. ఏకంగా 100 కోట్ల మోసం..!

The Raja Saab: ది రాజా సాబ్ వల్ల లాభ పడింది ఇద్దరే.. ఏకంగా 100 కోట్ల మోసం..!
Advertisement

The Raja Saab:
ఇప్పటి సంక్రాంతి సీజన్‌లో థియేటర్లలో విడుదలైన సినిమాలన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఐదు సినిమాలు రాగా అందులో ప్రభాస్ రాజా సాబ్ సినిమా మాత్రమే.. లాప్టాప్ తెచ్చుకుంది. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా మీద భారీ అంచనాలు ఉండగా..ఆ స్థాయిలో ఫలితం మాత్రం రాలేదు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ అయింది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత.. పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

బాక్సాఫీస్ రిపోర్ట్స్ ప్రకారం..ది రాజా సాబ్ సినిమా తన థియేట్రికల్ రన్‌ను దాదాపుగా ముగించింది. ఇండియాలో సుమారు 150 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాగా, ఓవర్సీస్ నుంచి దాదాపు 34 కోట్ల రూపాయలు వచ్చాయి. మొత్తంగా వరల్డ్‌వైడ్ కలెక్షన్ సుమారు 184 కోట్ల రూపాయల వద్ద ఆగిపోయింది. ప్రభాస్ స్థాయి హీరోకి ఇది చాలా తక్కువ కలెక్షన్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

సినిమాకు ఓపెనింగ్ కూడా అంత బలంగా రాలేదు. మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు వేగంగా పడిపోయాయి. సంక్రాంతి హాలిడేస్ వల్ల కొంతవరకు కలెక్షన్లు నిలబడ్డా, పండగ సీజన్ ముగిసిన తర్వాత థియేటర్లలో సినిమా పూర్తిగా ఖాళీ అయిపోయింది.

ఇదిలా ఉండగా, నిర్మాత నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ వల్ల లాభపడింది ఇద్దరే అని చెప్పుకొచ్చారు. అయితే అది దర్శకుడు మారుతి.. లైన్ ప్రొడ్యూసర్ SKN అని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇదే విషయంపైన.. నట్టి కుమార్ మాట్లాడుతూ.. ప్రభాస్‌కు సరైన న్యాయం జరగలేదని.. భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ తక్కువ స్థాయి VFX వాడారని ఆయన విమర్శించారు. సినిమా బడ్జెట్ నుంచి దాదాపు 100 కోట్ల రూపాయలు వాళ్ల పర్సనల్ పనులకు తీసుకొని, క్వాలిటీ విషయంలో రాజీ పడ్డారని కూడా చెప్పారు. అయితే వీటిపై ఎటువంటి అధికారిక రుజువు లేదు. ఇవన్నీ కూడా కేవలం గిత్తని వాళ్ళు కొంతమంది.‌. పాస్ చేసిన రూమర్స్ అని.‌. కొంతమంది అంటున్నారు.

Advertisement

ఈ రూమర్ సినిమా ముందు నుంచి వినిపిస్తూ వచ్చింది. ఇప్పుడు ఇదే విషయంపై ఈయన కూడా మాట్లాడడంతో.. ప్రభాస్ ని నిజంగానే మారుతీ. SKN.. మోసం చేశారా అన్న కామెంట్స్ ట్విట్టర్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఇక ఈ సంక్రాంతి పండుగకు.‌ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఇకపై ప్రభాస్ చేసే సినిమాల్లో కథ, టెక్నికల్ క్వాలిటీపై మరింత శ్రద్ధ పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ALSO READ: Balakrishna: బాలకృష్ణ ఫ్యామిలీని వెంటాడుతున్న ఫ్లాప్ సెంటిమెంట్ ఇదేనా..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×