E-Paper
Advertisement

Maragadha Mani 2: ‘మరకతమణి 2’కి కార్తీ క్లాప్.. ఆది పినిశెట్టి వైఫ్ రీ ఎంట్రీ!

Maragadha Mani 2: ‘మరకతమణి 2’కి కార్తీ క్లాప్.. ఆది పినిశెట్టి వైఫ్ రీ ఎంట్రీ!
Advertisement

Maragadha Mani 2: ఆది పినిశెట్టి (Aadhi Pinishetty) హీరోగా వచ్చిన ‘మరకతమణి’ (Maragadha Mani) సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. 2017లో వచ్చిన ఈ సినిమా మ్యాజికల్ కాన్సెప్ట్‌తో, ఫాంటసీ కామెడీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సీక్వెల్‌కు రంగం సిద్ధమైంది. అవును ‘మరకతమణి 2’ (Maragadha Mani 2) సినిమాను శివరాత్రి శుభ సందర్భంగా ఫిబ్రవరి 16న చెన్నైలో జరిగిన పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ పూజా కార్యక్రమంలో.. హీరో కార్తీ క్లాప్‌ కొట్టగా.. హీరో ఆర్య, దర్శకుడు వెంకట్ ప్రభు ‘కెమెరా.. రోలింగ్, యాక్షన్’ అంటూ షూటింగ్ ప్రారంభించారు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీతో అనుబంధం వున్న అనేక మంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Also Read- The Paradise: ఆయా షేర్.. నాని బర్త్‌డే‌కు ట్రీట్ రెడీ!

ఆది పినిశెట్టి వైఫ్ నిక్కీ రీ ఎంట్రీ

Advertisement

ఇక ఈ సీక్వెల్‌కు ఉన్న మరో విశేషమేమిటంటే.. పెళ్లి తర్వాత ఆది పినిశెట్టి వైఫ్ నిక్కీ గల్రానీ ఈ సినిమాలో చేస్తుండటం. ఆదితో పెళ్లి అనంతరం ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అలాంటి నిక్కీ గల్రానీ చాలా గ్యాప్ తర్వాత మరోసారి వెండితెరపై మెరవబోతోంది. నిక్కీ గల్రానీతో పాటు ఇందులో ప్రియా భవానీ శంకర్ కూడా హీరోయిన్‌గా ఇందులో నటిస్తోంది. ప్యాషన్ స్టూడియోస్, దంగల్ టీవీ, ఆర్‌డిసి మీడియా, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, గుడ్ షో బ్యానర్‌లపై సుధన్ సుందరం, మనీష్ సింఘాల్, దుర్గారం చౌదరి, దేవ్ అండ్ కెవి దురై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గత బ్లాక్ బస్టర్ ‘మరకతమణి’కి దర్శకత్వం వహించిన ఎఆర్‌కె శరవణ్ దర్శకత్వం వహిస్తున్నారు. సాంకేతిక విభాగంలో ధిబు నినన్ థామస్ సంగీతాన్ని అందిస్తుండగా, పీవీ శంకర్ సినిమాటోగ్రఫీ, ఎన్‌కే రాహుల్ ఆర్ట్ డైరెక్షన్, తిరుమలై రాజన్ ఆర్ ఎడిటింగ్, రాజేష్ కన్నన్ డైలాగ్స్, పీసీ స్టంట్స్ యాక్షన్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Also Read- Prabhas: ప్రభాస్‌కు కేక్ పూస్తూ కనిపించిన కాజల్.. వైరల్ అవుతున్న పాత వీడియో

పార్ట్ 1ని మించేలా..

Advertisement

ఆది పినిశెట్టి, ప్రియా భవాని శంకర్, నిక్కీ గల్రానీ పినిశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, మునిష్కాంత్, ఆనందరాజ్, డానీ, అరుణ్‌రాజా కామరాజ్, మురుగానందం ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రకటనతోనే భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఇందులో మరింత వినోదం, మ్యాజిక్, థ్రిల్లింగ్ అనుభూతిని అందించే కంటెంట్ ఉందని, కచ్చితంగా ఈ సినిమా మొదటి పార్ట్‌ని మించి ఎంటర్‌టైన్ చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ విరామం లేకుండా కొనసాగుతుందని, త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్‌ను తెలియజేస్తామని ఈ సందర్భంగా నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read- Sridevi: రాజమ్మగా శ్రీదేవి.. బ్యాండ్ మేళం నుంచి స్పెషల్ వీడియో రిలీజ్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×