// // Mansion House Mallesh: మింగలేక మంగళారాం అంట.. -->
E-Paper
Advertisement

Mansion House Mallesh: మింగలేక మంగళారాం అంట.. ఎంతకు తెగించార్రా?

Mansion House Mallesh: మింగలేక మంగళారాం అంట.. ఎంతకు తెగించార్రా?
Advertisement

Mansion House Mallesh: ఈ మధ్యకాలంలో బూతు లేకుండా సినిమాలను ప్రమోట్ చేసుకోలేకపోతున్నారు. స్టేజ్‌పై బూతు పదాలు వాడటం, తిట్టుకోవడం, లేదంటే ఏదో ఒక కాంట్రవర్సీ అయ్యేలా ప్లాన్ చేయడం వంటివి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏకంగా బూతుని మిక్స్ చేసి ఓ పాటను వదిలారు. టాలీవుడ్‌‌లో టైటిల్‌తోనే వైబ్ క్రియేట్ చేస్తున్న సినిమా ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ (Mansion House Mallesh). శ్రీనాథ్ మాగంటి హీరోగా, బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే ఇండస్ట్రీలో ఒక రకమైన క్యూరియాసిటీని పెంచేసింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుండి ‘మింగలేక మంగళారం’ (Mingaleka Mangalaaram) అనే బూతుని మిక్స్ చేసి ఓ మాస్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట వింటుంటేనే అర్థమవుతోంది, సినిమాలో మల్లేష్ క్యారెక్టర్ ఎంత ‘కిక్కు’ ఇచ్చేలా ఉంటుందో! కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Also Read- Seetha Payanam: నాలుగు రోజుల ‘సీతా పయనం’ కలెక్షన్స్ ఎంతంటే.. హిట్టేనా?

అంతా డబుల్ మీనింగే..

Advertisement

ఈ లిరికల్ సాంగ్ చూస్తుంటే, ఒక సామాన్యుడి జీవితంలో ఉండే కష్టాలు, ఆ కష్టాలను మర్చిపోవడానికి వాడు చేసే చిత్ర విన్యాసాలు చాలా ఫన్నీగా, రియలిస్టిక్‌గా ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది. ఈ పాటకు సురేష్ బొబ్బిలి మాస్ ట్యూన్‌తో కంపోజ్ చేశారు. వినగానే కాళ్లు ఆటోమేటిక్‌గా స్టెప్పులేసేలా ఉన్న ఈ పాటలో మెయిన్ హైలైట్ ఎవరంటే, బిత్తిరి సత్తి. తనదైన పెక్యులర్ వాయిస్‌తో సత్తి పాడిన విధానం ఈ సాంగ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. తరుణ్ సైదులు రాసిన లిరిక్స్ ప్రతి సామాన్యుడికి, ముఖ్యంగా మందు బాబులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ‘మింగలేక మంగళారం’ అనే సామెతను మల్లేష్ క్యారెక్టరైజేషన్‌కు తగ్గట్టుగా మలిచిన తీరు బాగుందనే చెప్పాలి కానీ, అంతా డబుల్ మీనింగే ఇందులో ఉంది.

Also Read- Big Tv Kissik Talks: అమ్మ కోసమే బ్రతికాను… పల్సర్ బైక్ రమణ బ్రేకప్ లవ్ స్టోరీ..

‘మెన్షన్ హౌస్ మల్లేష్’ వచ్చేది ఎప్పుడంటే..

Advertisement

ఈ పాట ద్వారా మల్లేష్ అనే వ్యక్తి సమాజంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు, అతని మైండ్‌సెట్ ఏంటి అనేది చాలా ఎంటర్టైనింగ్‌గా ఆవిష్కరించారు. సినిమాలో హీరో శ్రీనాథ్ పాత్ర యువతను థియేటర్ల వైపు రప్పిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ప్రముఖ ఎడిటర్ గ్యారీ BH తన కత్తెరకు పదును పెట్టగా, అమ్మముత్తు డీవోపీగా విజువల్స్ అదరగొట్టారు. కేవలం పాటలే కాకుండా, సినిమాలో బలమైన కామెడీ ట్రాక్ కూడా ఉందని తెలుస్తోంది. మురళీధర్ గౌడ్, రాజ్ కుమార్ కసిరెడ్డి వంటి సీనియర్ అండ్ కామెడీ టైమింగ్ ఉన్న నటులు కీలక పాత్రల్లో నటించడంతో ఈ ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ కచ్చితంగా ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ అవుతుందనే అనుకోవచ్చు. ఈ సినిమాని మార్చి 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read- Prashanth Varma: ప్రభాస్ ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోలేదు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×