E-Paper
Advertisement

బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేస్ ఫైల్.. బాధాకరం అంటూనే మంచు మనోజ్ షాకింగ్ పోస్ట్!

బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేస్ ఫైల్.. బాధాకరం అంటూనే మంచు మనోజ్ షాకింగ్ పోస్ట్!
Advertisement

Manchu Manoj: ఈనెల 8వ తేదీన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై ఫోక్సోకేస్ నమోదైన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ విషయం యావత్ రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.. దీనిపై పలువురు రాజకీయ , సినీ ప్రముఖులు స్పందిస్తూ సంచలన కామెంట్లు చేస్తున్నారు.. ఈ క్రమంలోనే తాజాగా మోహన్ బాబు వారసుడు.. ప్రముఖ నటుడు మంచు మనోజ్ కూడా స్పందిస్తూ ..ఒక సుదీర్ఘ పోస్ట్ ను ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేశారు.

ఎవరైనా సరే బాధితులకు న్యాయం జరగాలి – మంచు మనోజ్

“కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్ పై ఇటీవల నమోదైన పోక్సో కేసు నన్ను తీవ్రంగా కలచివేసింది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ప్రతి మైనర్ బాలికకు ఖచ్చితంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే పోక్సో చట్టాన్ని తీసుకొచ్చారని.. నేను బలంగా నమ్ముతున్నాను. ముఖ్యంగా అధికారం, పదవి , పలుకుబడి లేదా హోదా ఎప్పుడూ కూడా న్యాయానికి అడ్డు రాకూడదు. రాజ్యాంగం, చట్టం దృష్టిలో ఎవరైనా సరే బాలికలకు, మహిళలకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే.. ముఖ్యంగా ప్రతి బాలికకు సమానమైన న్యాయం దక్కుతుంది. మైనర్లకు సంబంధించిన కేసుల్లో ఇంకా వేగంగా స్పందించాలి .

పారదర్శకత చాలా అవసరం..

Advertisement

అలాగే పారదర్శకత, జవాబుదారీతనం చాలా అవసరం. విచారణలో జాప్యం జరిగినా, మౌనం వహించినా లేదా పక్షపాత చర్యలు తీసుకున్నా సరే అది న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది.. ముఖ్యంగా ఇది రాజకీయాలకు లేదా వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు. నిజం బయటకు రావాలి.. న్యాయం గెలవాలి.. ఎలాంటి ఒత్తిళ్ళు , ప్రభావాలకు తావు లేకుండా.. ఈ కేసు దర్యాప్తులో చట్టపరమైన ప్రక్రియలన్నీ అత్యంత వేగంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలని.. నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..

న్యాయం జరిగినట్లు కనిపించాలి..

న్యాయం జరగడమే కాదు.. అది జరిగినట్లు అందరికీ స్పష్టంగా కనిపించాలి కూడా.. చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానులే అని ఈ కేసు ద్వారా మరోసారి నిరూపితం కావాలి.. న్యాయం కావాలి ” అంటూ మంచు మనోజ్ తెలిపారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలేం జరిగింది?

Advertisement

అసలేం జరిగింది అనే విషయానికి వస్తే.. ఈనెల 8వ తేదీన ఒక తల్లి తన 17 ఏళ్ల కుమార్తెను బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వేధిస్తున్నాడు అంటూ ఇచ్చిన ఫిర్యాదుతో పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో నిందితుడిపై సెక్షన్11 రెడ్ విత్ 12 పోక్సో చట్టంతో పాటు బి ఎన్ ఎస్ 74, 75 సెక్షన్లను ప్రయోగించారు.

ALSO READ:శివ కార్తికేయన్ ప్రొడక్షన్ పేరుతో భారీ మోసం.. అసలు నిజం బయటపెట్టిన హీరో!

కేసులో సరికొత్త మలుపు..

ఇక మరొకవైపు ఈ వివాదం సరికొత్త మలుపు తీసుకుంది. సదరు బాలిక తల్లిదండ్రులు తనను డబ్బుల కోసం బెదిరిస్తున్నారు అంటూ భగీరథ్ కరీంనగర్ పోలీస్ లను కూడా ఆశ్రయించారు. ఈ ప్రతి ఫిర్యాదు ఆధారంగా ముగ్గురిపై కరీంనగర్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి ఈ అంశంపై ఆరా తీయడమే కాకుండా సైబరాబాద్ సిపి నుంచి పూర్తిస్థాయి నివేదికను కూడా తెప్పించారు. దీనిపై లోతైన విచారణ జరిపేందుకు కమిషన్ ఒక ప్రత్యేకమైన బెంచ్ ని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు దీనిపై అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జోక్యం చేసుకోవడంతో ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఇక త్వరలోనే నిందితుడిని అరెస్టు చేయాలి అని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×