E-Paper
Advertisement

మంచు మనోజ్ బర్త్‌డే స్పెషల్.. ‘ఐక్య’ ట్రస్ట్, సినిమాలు, రాజకీయాలపై క్రేజీ అప్‌డేట్స్!

మంచు మనోజ్ బర్త్‌డే స్పెషల్.. ‘ఐక్య’ ట్రస్ట్, సినిమాలు, రాజకీయాలపై క్రేజీ అప్‌డేట్స్!
Advertisement

Manchu Manoj: టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ వైవిధ్యమైన పాత్రలతో, వైవిధ్యభరితమైన చిత్రాలతో కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్నారు. మే 20న ఆయన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తన కొత్త సేవా సంస్థ ‘ఐక్య’, రాబోయే సినిమాలు, రాజకీయ రంగప్రవేశం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆయన పంచుకున్న ముఖ్యాంశాలు మీకోసం:

‘ఐక్య ధైర్య సేనా సమితి’.. నా మూడో బిడ్డ

సమాజంలో ఎలాంటి గొంతుక లేని అణగారిన వర్గాల (వాయిస్‌లెస్) తరఫున నిలబడటానికే ‘ఐక్య’ ట్రస్ట్‌ను స్థాపించినట్లు మనోజ్ తెలిపారు. “నేనేమీ సూపర్ మ్యాన్‌ని కాదు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండలేను. అందుకే ఒక వ్యవస్థగా పని చేయాలని ఈ ట్రస్ట్ పెట్టాం. అందరం ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలం. నా కొడుకు ‘ధైరవ్’, నా కుమార్తె ‘దేవసేన’ పేర్లు కలిసొచ్చేలా దీనికి ‘ఐక్య ధైర్య సేనా సమితి’ అని పేరు పెట్టాం. ఈ ట్రస్ట్ మాకు మరో బిడ్డ లాంటిది” అని మనోజ్ ఎమోషనల్ అయ్యారు. దీనికి ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని, నిధుల కోసం ఫండ్ రైజింగ్ నిర్వహిస్తామని, జూన్ 7న పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

Advertisement

Read also-‘పెద్ది’ ట్రైలర్‌ గురించి రిషబ్ శెట్టి పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చూస్తే ఫ్యాన్‌కు పండగే..

సినిమాల జాతర..

తన సినీ ప్రయాణంపై మాట్లాడుతూ, తనకు సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన విజయ్ కనకమేడల, కార్తిక్ ఘట్టమనేనిలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ప్రస్తుతం తన చేతిలో 5-6 ప్రాజెక్టులు ఉన్నాయని, వరుసగా సినిమాలు చేయడమే తన ప్లాన్ అని తెలిపారు.

Advertisement

రక్షక్: జూన్ 7న ప్రారంభం కానున్న ఈ చిత్రం మహిళా సాధికారత, వారు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో సాగుతుంది. ఇందులో మనోజ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ (DCP) పాత్రలో కనిపించనున్నారు.

డేవిడ్ రెడ్డి: ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో అక్కడ కీలక షెడ్యూల్ పూర్తి చేశారు. పుట్టినరోజు (మే 20) సాయంత్రం దీనికి సంబంధించిన గ్లింప్స్ విడుదల కానుంది.

వాట్ ది ఫిష్: సత్య, వెన్నెల కిషోర్‌లతో చేయాల్సిన ఈ చిత్రం కథ అద్భుతంగా ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో వీసా సమస్యల వల్ల ప్రస్తుతానికి వాయిదా పడింది.

మోహన రాగ మ్యూజిక్: ఇప్పటివరకు నాలుగు పాటల రికార్డింగ్ పూర్తయింది. మరో నాలుగు పాటలు సిద్ధం కావడానికి 2-3 నెలల సమయం పడుతుంది.

Read also-వివాదంలో ‘కరుప్పు’ సినిమా.. ఇళయరాజాకు క్షమాపణలు చెప్పిన మూవీ టీం.. ఏం జరిగిందంటే?

ప్రత్యక్ష రాజకీయాలు..

రాజకీయాల గురించి స్పందిస్తూ.. “మేం పుట్టినప్పటి నుంచీ రాజకీయ వాతావరణంలోనే ఉన్నాం. కొత్తగా రావడం అంటూ ఏమీ లేదు. వచ్చే ఎన్నికల్లో నా భార్య మౌనిక పోటీ చేస్తారు” అని క్లారిటీ ఇచ్చారు. అలాగే తన భార్య మౌనిక ఆధ్వర్యంలోని ‘నమస్తే వరల్డ్’ టాయ్స్ బిజినెస్‌ను త్వరలోనే బెంగళూరుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నామని, తాను కేవలం సపోర్ట్‌గా మాత్రమే ఉంటానని తెలిపారు. తమ వృత్తిపరమైన విషయాల్లో ఒకరినొకరు గౌరవించుకుంటామని స్పష్టం చేశారు.

తారక్, సిరివెన్నెలలతో బంధం

మే 20న తనతో పాటు ఎన్టీఆర్ (తారక్ అన్న), స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పుట్టినరోజు కూడా కావడంపై మనోజ్ ఆనందం వ్యక్తం చేశారు. సిరివెన్నెల గారికి అంతం లేదని, ఆయన పాటల రూపంలో ఎప్పుడూ మనలోనే ఉంటారని ఈ సందర్భంగా మనోజ్ స్మరించుకున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×