E-Paper
Advertisement

బాలయ్య బాబు ‘NBK111’ నుంచి క్రేజీ అప్డేట్.. విలన్‌గా మంచు మనోజ్..

బాలయ్య బాబు ‘NBK111’ నుంచి క్రేజీ అప్డేట్.. విలన్‌గా మంచు మనోజ్..
Advertisement

NBK111 Movie: తెలుగు సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పుతున్న చిత్రాల్లో ‘NBK111’ ఒకటి. నందమూరి బాలయ్య బాబు హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై తాజాగా మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో నటుడు మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఆయన పాత్ర విలన్‌గా ఉండొచ్చన్న ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

Read also-సమాజ సేవలో యువ నటుడు సంజోష్.. స్కాలర్‌షిప్స్ పంపిణీ!

Advertisement

ఈ అప్‌డేట్‌ను షేర్ చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని.. సినిమాలో మనోజ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని వెల్లడించారు. దీంతో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. గతంలో ‘ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?’ చిత్రంలో కలిసి నటించిన బాలకృష్ణ, మంచు మనోజ్.. ఇప్పుడు మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుండటం విశేషంగా మారింది.

ఇక ఈ సినిమా చారిత్రాత్మక కథాంశంతో రూపొందుతున్నట్లు సమాచారం. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనుండటం మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న రెండో చిత్రం కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Advertisement

Read also-టాలీవుడ్ ‘రాక్ స్టార్’ మంచు మనోజ్ బర్త్‌డే స్పెషల్.. నెపోటిజం నుంచి బయటకు వచ్చి..

అలాగే ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తోంది. గతంలో బాలకృష్ణ, నయనతార కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ చిత్రాలు మంచి విజయాలను అందుకోవడంతో, వీరిద్దరి కాంబోలో వస్తున్న నాల్గవ చిత్రంగా ‘NBK111’పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ సినిమాకు థమన్ సంగీతం అందించడం ఇది ఆరోసారి కావడంతో, మాస్ ఆడియన్స్‌తో పాటు సినీ అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ హైప్ ఏర్పడింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×