// // Manchu Manoj: పవన్ కళ్యాణ్ తో మనోజ్ దంపతులు.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Manchu Manoj: బేగంపేట ఎయిర్ పోర్టులో పవన్ తో మనోజ్ దంపతులు భేటీ…

Manchu Manoj: బేగంపేట ఎయిర్ పోర్టులో పవన్ తో మనోజ్ దంపతులు భేటీ…
Advertisement

Manchu Manoj: రాకింగ్ స్టార్ట్ మనోజ్ మంచు ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన డేవిడ్ రెడ్డి (David Reddy)అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు వారసుడిగా మనోజ్ బాలా నటుడు గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇలా తన తండ్రి నటించిన పలు సినిమాలలో బాలనటుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించిన మనోజ్ అనంతరం హీరోగా వెండి తెరపై సందడి చేశారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న మనోజ్ తన వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమయ్యారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మనోజ్ తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

డేవిడ్ రెడ్డి గా మనోజ్ మంచు..

తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా భైరవం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పరవాలేదు అనిపించుకున్న మనోజ్ అనంతరం మిరాయ్ సినిమా ద్వారా విలన్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం డేవిడ్ రెడ్డి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇలా మనోజ్ హీరోగా వెండి తెర పై సందడి చేస్తూనే మరోవైపు తన భార్య భూమా మౌనికతో కలిసి పలు బిజినెస్లను కూడా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా మంచు మనోజ్ భూమా మౌనిక దంపతులు సినీ నటుడు పవన్ కళ్యాణ్(Pawankalyan) తో భేటీ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ను కలిసిన మనోజ్..

Advertisement

పవన్ కళ్యాణ్ మనోజ్ దంపతులు ఉద్దేశపూర్వకంగా కలవలేదని తెలుస్తోంది. అనుకోకుండా బేగంపేట ఎయిర్ పోర్టులో వీరు కలిసారని తెలుస్తోంది. ఇలా పవన్ కళ్యాణ్ తో మనోజ్ కాసేపు పలు అంశాల గురించి మాట్లాడినట్లు తెలుస్తుంది. ఇక మనోజ్ పవన్ కళ్యాణ్ మధ్య చాలా మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ తనని మందలించడం వల్ల తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని మనోజ్ తెలియచేశారు. సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ సమయంలో తనని పిలిపించుకొని మరి తనకు అర్థమయ్యేలాగా మందలించారని పవన్ కళ్యాణ్ తో తనకున్నటువంటి రిలేషన్ గురించి మనోజ్ తెలియజేశారు.

Advertisement

ఇక పవన్ కళ్యాణ్ సినిమాలు మాత్రమే కాకుండా రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ కోసం మనోజ్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం వీరిద్దరూ సినిమాల పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయ కార్యకలాపాలలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఈయన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా పట్ల అభిమానులలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా అనంతరం పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు ఉగాది పండుగ తర్వాత ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది.

Also Read: Anjali Pawan: కొడుకును పరిచయం చేసిన బుల్లితెర నటి అంజలి పవన్..ఎంత క్యూట్ గా ఉన్నాడో..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×