E-Paper
Advertisement

David Reddy Movie: వేట ప్రారంభించిన మంచు మనోజ్.. వైల్డ్ పోస్టర్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ లాక్!

David Reddy Movie: వేట ప్రారంభించిన మంచు మనోజ్.. వైల్డ్ పోస్టర్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ లాక్!
Advertisement

David Reddy movie: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మంచు మనోజ్ (Manchu Manoj) దాదాపు 9 ఏళ్లపాటు కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే. రీఎంట్రీలో భాగంగా ‘భైరవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. ఈ సినిమాతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) నటించిన ‘మిరాయ్’ సినిమాలో విలన్ పాత్రలో నటించి.. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అలాంటి ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం డేవిడ్ రెడ్డి(David Reddy).

పవర్ఫుల్ రీ ఎంట్రీ ఇస్తున్న మంచు మనోజ్..

మంచు మనోజ్ నుంచి ఒక పవర్ఫుల్ రీ ఎంట్రీ కావాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వేళ అందుకు సిద్ధం అయిపోయారు మంచు మనోజ్. అందులో భాగంగానే ఇప్పుడు తన కొత్త సినిమాతో పవర్ఫుల్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం డేవిడ్ రెడ్డి. ఈ సినిమాకి హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తుండగా.. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై మొటుకూరి భరత్, నల్లగంగుల వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై మంచి బజ్ ఏర్పడగా.. తాజాగా మనోజ్ చేసిన ప్రకటన అభిమానులలో మరింత ఉత్సాహాన్ని పెంచింది.

డేవిడ్ రెడ్డి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ డేట్ లాక్..

Advertisement

రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న డేవిడ్ రెడ్డి సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు మనోజ్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఒక వైల్డ్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ..” క్రూరమైన యుగం రేపు ఉదయం 11:11 గంటలకు ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా రూత్ లెస్ ఉదయం 11:11 గంటలకు, బ్రూటల్ సాయంత్రం 4:44 గంటలకు మొదలు కాంబోతోంది” అంటూ రాసుకు వచ్చారు.

క్రూరమైన పోస్టర్ పంచుకున్న టీమ్..

ఇకపోతే తాజాగా పంచుకున్న పోస్టర్లో ముళ్ళ తీగలతో ఉన్న కర్రపై మొత్తం రక్తం చిందుతూ చాలా క్రూరంగా కనిపించింది. ఇక దీన్ని చూస్తుంటే ఇప్పటివరకు మనోజ్ చేసిన పాత్రలు ఈసారి మరింత రా అండ్ ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు అని చెప్పవచ్చు. ఏది ఏమైనా మంచు మనోజ్ కెరియర్ డేవిడ్ రెడ్డికి ముందు ఆ తర్వాత అన్నట్టు నిలుస్తుంది అని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే తాజాగా మంచు మనోజ్ షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మంచు మనోజ్ కెరియర్..

Advertisement

మంచు మనోజ్ కెరియర్ విషయానికి వస్తే.. మేజర్ చంద్రకాంత్ చిత్రంలో బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశారు. 2004లో వచ్చిన దొంగ దొంగది చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. బిందాస్ సినిమాలో ఉత్తమ నటన కనబరిచి నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు. ఇక మనోజ్ ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. డేవిడ్ రెడ్డితో పాటు వాట్ ది ఫిష్ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే మిరాయ్ సీక్వెల్లో కూడా నటించబోతున్నారు.

also read:Shiva Jyoti: ఐవీఎఫ్ ద్వారా గర్భం.. శివజ్యోతి ఏమన్నారంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×