E-Paper
Advertisement

Manasantha Nuvve: ఉదయ్ కిరణ్ ‘మనసంతా నువ్వే’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?

Manasantha Nuvve: ఉదయ్ కిరణ్ ‘మనసంతా నువ్వే’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?
Advertisement

Manasantha Nuvve: టాలీవుడ్ ‘లవర్ బాయ్’ ఉదయ్ కిరణ్ మరణించి దశాబ్ద కాలం దాటినా, ఆయన సినిమాల పట్ల ప్రేక్షకులకి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా యువతను ఉర్రూతలూగించిన ఆయన క్లాసిక్ లవ్ స్టోరీ ‘మనసంతా నువ్వే’ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. పెద్ద హీరోల సినిమాలతో పాటు ఎవర్‌గ్రీన్ లవ్ స్టోరీలను కూడా ప్రేక్షకులు మళ్ళీ థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన ‘మనసంతా నువ్వే’ చిత్రాన్ని ఫిబ్రవరి 14న, వాలెంటైన్స్ డే (ప్రేమికుల రోజు) సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

Read also-Kushi Kapoor: బికినీ అందాలతో హీట్ పుట్టిస్తున్న ఖుషీ కపూర్!

Advertisement

ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈ సినిమాను ప్రేమికుల రోజున విడుదల చేయడం నిజంగా సినీ అభిమానులకు ఒక గొప్ప కానుక అని చెప్పవచ్చు. ‘మనసంతా నువ్వే’ ఒక అద్భుత కావ్యం 2001లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎం.ఎస్. రాజు నిర్మించారు. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ముఖ్యంగా మూడు విషయాలు గుర్తొస్తాయి. ఉదయ్ కిరణ్ – రీమా సేన్ జోడీ చిన్నప్పటి స్నేహం, పెద్దయ్యాక ఒకరి కోసం ఒకరు వెతుక్కునే ఆరాటం ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఆర్.పి. పట్నాయక్ సంగీతం ఈ సినిమా విజయంలో సంగీతం సింహభాగం వహించింది. “తూనీగ తూనీగ”, “మనసంతా నువ్వే”, “ఆకాశాన సూర్యుడుంటాడు” వంటి పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినపడుతూనే ఉంటాయి.

Read also-Exclusive: శ్రీ విష్ణు మూవీ విష్ణు విన్యాసం విడుదల తేదీ ఖరారు.. రిలీజ్ ఎప్పుడంటే..?

Advertisement

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా, స్వచ్ఛమైన ప్రేమకథగా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పట్లో ఈ సినిమాను సిల్వర్ జుబ్లీ హిట్ చేశారు ప్రేక్షకులు. ఇప్పుడు మళ్ళీ 4K క్వాలిటీతో, సరికొత్త సౌండ్ ఎఫెక్ట్స్‌తో రీ-రిలీజ్ అవుతుండటంతో అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి సిద్ధమవుతున్నారు ఆడియన్స్. ముఖ్యంగా నేటి తరం యువతకు ఉదయ్ కిరణ్ మ్యాజిక్‌ను వెండితెరపై చూసే గొప్ప అవకాశం ఇది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×