E-Paper
Advertisement

The RajaSaab: ఆ స్టంట్స్ నావే.. రూమర్స్ కి చెక్ పెట్టిన మాళవిక!

The RajaSaab: ఆ స్టంట్స్ నావే.. రూమర్స్ కి చెక్ పెట్టిన మాళవిక!
Advertisement

The RajaSaab:ప్రముఖ దర్శకుడు మారుతీ (Maruthi )దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన చిత్రం ‘ది రాజాసాబ్’. ప్రభాస్ కెరియర్ లోనే తొలిసారి హారర్ కామెడీ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. నిజానికి ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా చాలా స్టైలిష్ గా వింటే లుక్కులో కనిపించారు. కానీ సీన్స్ తెరపై చూపించడంలో మారుతీ ఫెయిల్ అయ్యాడనే వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా మాళవిక మోహనన్ (Malavika mohanan), నిధి అగర్వాల్(Niddhi Agerwal), రిద్దీ కుమార్ (Riddhi Kumar) హీరోయిన్లుగా నటించారు.

మాళవిక యాక్షన్ స్టంట్స్..

ఇకపోతే ఈ సినిమా విడుదలైన నెలలోపే జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఓటీటీలో చూసిన ఆడియన్స్.. ఒక విలన్ తో మాళవిక ఫైట్ చేసే సన్నివేశంలో మాళవిక స్థానంలో డూపును పెట్టి కానించేసారు అనే విమర్శలు వచ్చాయి. దీనికి తోడు ఆ ఫైట్ సీన్లో విలన్ గా నటించిన రాన్సన్ విన్సెంట్ కూడా మాళవిక గెటప్ లో ఉన్న డూప్ తో కలిసి ఫోటో షేర్ చేయడంతో నిజంగానే డూప్ ని వాడారు. అయితే ఇక్కడ అమ్మాయి కోసం అబ్బాయిని డూప్ గా వాడడం ఏంటి అంటూ చాలామంది విమర్శలు గుప్పించారు. అయితే దీనిపై తాజాగా మాళవిక స్పందించింది.

ట్రోల్స్ పై క్లారిటీ..

Advertisement

మాళవిక ఎక్స్ వేదికగా..” నేనే నా స్టంట్స్ చేశాను సినిమాల్లో రిస్కీ షార్ట్స్ చేసేటప్పుడు లేదా రిహార్సల్స్ కోసం ప్రొఫెషనల్ స్టంట్ డబుల్స్ ఉండడం సర్వసాధారణం. కానీ సినిమాలో మీరు చూసిన ఆ యాక్షన్ సీక్వెన్స్ లో నేను స్వయంగా పాల్గొన్నాను. నిజానికి అమ్మాయిలకు యాక్షన్ సీన్స్ చేసే అవకాశం రావడం చాలా అరుదు అందుకే ఇష్టమైన స్టంట్స్ చేయడానికి నేను ఎంతో కష్టపడ్డాను అని వీడియో ఆధారాలతో సహా మాళవిక సమాధానం ఇచ్చింది. ఇక మాళవిక సమాధానంతో ట్రోలర్స్ నోళ్లు మూతపడ్డాయని చెప్పవచ్చు.. ఇకపోతే సెట్స్ లో ఈమె స్వయంగా రోప్ సహాయంతో కష్టమైన ఫైట్స్ చేస్తున్న బిహైండ్ ద సీన్స్ వీడియోలను ప్రూఫ్స్ గా షేర్ చేసింది మాళవిక మోహన్. మొత్తానికైతే ఇన్ని రోజులు డూప్ అంటూ చేసిన కామెంట్లకు ఆమె ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చిందని చెప్పవచ్చు.

also read:Hero Dhanush: హీరో ధనుష్ కి లీగల్ నోటీసులు..రూ.20 కోట్లు కట్టు!

మాళవిక మోహనన్ సినిమాకు..

Advertisement

మాళవిక మోహనన్ విషయానికి వస్తే.. మలయాళంలో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ఈమె.. తొలిసారి ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మాళవికకు ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందివ్వకపోవడం బాధాకరం అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం తమిళ్, మలయాళం చిత్రాలలో బిజీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×