E-Paper
Advertisement

Malavika Mohanan: రాజాసాబ్‌లో ఐదారు సీన్స్‌ మాత్రమే.. ప్రభాస్‌తో యాక్టింగ్‌పై మాళవిక కామెంట్స్!

Malavika Mohanan: రాజాసాబ్‌లో ఐదారు సీన్స్‌ మాత్రమే.. ప్రభాస్‌తో యాక్టింగ్‌పై మాళవిక కామెంట్స్!
Advertisement

Malavika Mohanan Comments on Raja Saab: ప్రభాస్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రాల్లో ‘ది రాజా సాబ్‌ ఒకటి’. మారుతి దర్శకత్వంలో కామెడీ, హార్రర్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌, స్పెషల్‌ వీడియో, గ్లింప్స్‌ బాగా ఆకట్టున్నాయి. ఇక రెండు రోజుల క్రితం విడుదలైన పాటకు కూడా మంచి రెస్పాన్స్‌ వస్తుంది.

కామెడీ, హార్రర్

కామెడీ, హారర్‌తో వస్తున్న ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్‌కి పెద్ద పీట వేస్తున్నారు. అందుకే మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ఆలస్యం అవుతున్నట్టు మూవీ టీం పేర్కొంది. అయితే ఇందులో ప్రభాస్‌ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌ల, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగులో ప్రేక్షకులకు పరిచమైన మలయాళ భామ మాళవిక మోహన్‌ ది రాజా సాబ్‌తోనే తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. తెలుగులో ఇదే ఆమె డెబ్యూ చిత్రం కావడం విశేషం. అయితే తాజాగా ఈ సినిమాలో తన రోల్‌పై, ప్రభాస్‌తో నటించడంపై మాళవిక స్పందించింది.

రాజా సాబ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా

Advertisement

చెన్నైలో జరిగిన ఓ మీడియా సదస్సులో మాళవిక మోహనన్‌ అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన ప్రస్తుతం సినిమాల గురించి ప్రస్తావించింది. అందులో తను చెప్పుకోదగ్గ సినిమా ది రాజా సాబ్‌ అని, తెలుగు సూపర్‌ స్టార్ ప్రభాస్‌తో తను నటిస్తున్నట్టు చెప్పింది. “ప్రస్తుతం ప్రభాస్‌, కార్తిలతో సినిమాలు చేస్తున్న. అందులో తెలుగు సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌తో ది రాజా సాబ్‌ సినిమా చేశాను. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయి ఈ పొంగల్‌కి జనవరి 9న విడుదలకు సిద్దమౌవుతుంది. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఎందుకుంటే ఇందులో నా పాత్ర చాలా బాగుంది. సూపర్‌ స్టార్‌ సినిమాల్లో హీరోయిన్లకు చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఒక ఐదారు సీన్లు, ఒక పాట మాత్రమే ఉంటుంది.

Also Read: Ravi Teja : మాస్ మహారాజా కోసం తమిళ్ పొన్ను , కనీసం ఈ సినిమా అయినా వర్కౌట్ అవుతుందా?

ఐదారు సీన్స్ మాత్రమే అనుకున్నా

Advertisement

ఒకవేళ రెండు పాటలు ఉంటే మాత్రం ఎంతో అద్రుష్టం ఉంటే కానీ అల జరగదు. రాజా సాబ్‌లో కూడా నాకు ఓ ఐదారు సీన్లు, ఓ పాట ఉంటుందని అనుకున్నాను. కానీ, ఇందులో ఒక అమ్మాయిగా (హీరోయిన్‌) నాకు చాలా మంచి రోల్‌ దొరికింది” అంటూ మురిసిపోయింది. “ఆ తర్వాత సినిమా అంటే ప్రతి ఒక్కరి ఒక పజిల్‌ లాంటిందని, సినిమా, కెరీర్‌ అంటే ఒక పజిల్‌. మనకు పెద్ద బడ్జెట్‌, స్టార్‌ హీరో, డైరెక్టర్‌ సినిమాల్లో ఛాన్స్‌ దొరకలాంటే చాలా కష్టపడాలి. ఒక వచ్చినా.. అందులో మన రోల్‌ ఎలా ఉంటుందనేది సమస్య. ఒకవేళ మంచి రోల్‌ వచ్చినా.. అందులో మన ప్రాధాన్యత ఎంత, మన క్రాఫ్ట్‌ ఎలా ఉంటుంది. ఒక దొరకపోయినా వచ్చిన పాత్రతో సంతషపడాలి. అలా ప్రతిధి మన లైఫ్‌లో ఒక పజిల్‌ లాంటిదే” అని మాళవిక చెప్పుకొచ్చింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×