E-Paper
Advertisement

The Raja Saab Pre Release: ఈవెంట్‌ ఇండియాలో కాదు.. ఫ్యాన్స్‌ని మోసం చేస్తున్నారు భయ్యా

The Raja Saab Pre Release: ఈవెంట్‌ ఇండియాలో కాదు.. ఫ్యాన్స్‌ని మోసం చేస్తున్నారు భయ్యా
Advertisement

The Raja Saab Pre Release Event: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సినిమా లైనప్‌ గురించి తెలిసిందే. ప్రస్తుతం అతడి చేతిలో దాదాపు అరడజన్‌ సినిమాలు ఉన్నాయి. అందులో ఏది ఎప్పుడు పూర్తవుతుంది, ఏది ముందుగా థియేటర్లకు వస్తుందనేది క్లారిటీ లేదు. అలాగే సినిమా షూటింగ్‌ లపై పెద్దగా అప్‌డేట్స్‌ లేవు. దీంతో ప్రభాస్‌ సినిమాలకు సంబంధించి ఏ అప్‌డేట్‌ వచ్చిన ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం ప్రభాస్‌ సినిమా అప్‌డేట్‌ అంటేనే పండగ అనేట్టు అయిపోయింది పరిస్థితి. ప్రస్తుతం ప్రభాస్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ చిత్రాల్లో ది రాజా సాబ్‌ ఒకటి.

స్లో స్లోగా షూటింగ్

మూడేళ్ల క్రితమే షూటింగ్ మొదలైన ఈ చిత్రం మెల్లిమెల్లిగా ముందుకు వెళుతుంది. ఇప్పటి వరకు వచ్చిన అప్‌డేట్స్‌ మూవీపై విపరీతమైన బజ్ పెంచుతున్నాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కి ఊహించని రెస్పాన్స్‌ వచ్చింది. గ్లింప్స్‌ తోనే మూవీపై బజ్‌ మరింత పెరిగింది. ఇక అసలైన అప్‌డేట్స్‌ టీజర్‌, ట్రైలర్‌ ఇస్తే ఆ స్వాగ్‌ ఎలా ఉంటుందో మీ ఊహాకే వదిలేస్తోంది మూవీ టీం. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాతికి థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో రాజా సాబ్‌ ఫస్ట్ సింగిల్ కూడా రానుంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి ఓ షాకింగ్‌ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అదే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ ఈవెంట్‌ కి సంబంధించిన అప్‌డేట్‌ చూసి ఇండియన్ ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

సంక్రాంతికి రిలీజ్‌

Advertisement

2026 జనవరి 9న ది రాజా సాబ్‌ మూవీ రిలీజ్ డేట్‌ని ఫిక్స్‌ చేసుకుంది. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్‌ వేగవంతం చేస్తుంది. ఇందులో భాగంగా రేపు నవంబర్‌ 23న ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ కానుంది. తర్వాత టీజర్‌, ట్రైలర్‌తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ని కూడా భారీగా ప్లాన్‌ చేస్తున్నారట మేకర్స్‌. ఇదిలా ఉంటే ది రాజా సాబ్ అప్‌డేట్స్‌ విషయం ముందు నుంచి మారుతి విభిన్న శైలికి పోతున్నారు. అప్‌డేట్స్‌ అన్నింటిని అవుటాఫ్‌ ది బాక్స్‌ అన్న రేంజ్‌లో హైప్‌ ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రీ రిలీజ్ విషయంలోనూ అదే హైప్ నెలకొంది. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. ది రాజా సాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ మేకర్స్‌ గ్రాండ్‌ గా ప్లాన్‌ చేస్తున్నారట.

Also Read: Mahesh Babu: వారణాసి వెనకున్న నిశ్శబ్దపు శక్తి.. కార్తికేయకు మహేష్‌ భారీ ఎలివేషన్‌

ఈవెంట్‌ ఇండియాలో కాదా?

Advertisement

ఈ ఈవెంట్‌ ఇండియాలో కాకుండ ఏకంగా విదేశాల్లో ప్లాన్‌ చేస్తున్నారట. అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించేందుకు మూవీ టీం గట్టి సన్నాహాలు చేస్తున్నట్టు సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది విషయం తెలిసిందే అభిమానులంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. భారీ సినిమా రిలీజ్ అంటే తమ స్వాగ్ చూపించేది ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనే. తమ అభిమాన హీరోని ఈవెంట్‌లో డైరెక్ట్‌ గా చూసి సినిమా గురించి స్వయంగా ఆయన మాటల్లోనే వింటనే అబిమానులకు అసలైన సందడి, పండుగ. అలాంటి ఈవెంట్‌ని ఇండియన్‌ ఫ్యాన్స్‌ దూరంగా ప్లాన్‌ చేయడం నిజంగా బ్యాడ్‌న్యూసే అంటున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియదు. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×