E-Paper
Advertisement

మరో సారి లీకుల బారిన పడ్డ రాజమౌళి సినిమా ‘వారణాసి’.. ఈ సారి యాక్షన్ వంతు..

మరో సారి లీకుల బారిన పడ్డ రాజమౌళి సినిమా ‘వారణాసి’.. ఈ సారి యాక్షన్ వంతు..
Advertisement

Mahesh Rajamouli: టాలీవుడ్ సెన్సేషనల్ కాంబినేషన్ రాజమౌళి – మహేష్ బాబు సినిమా అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ప్రస్తుతం ‘వారణాసి’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీని లీకుల బెడద వదలడం లేదు. గతంలో కొన్ని ఫోటోలు బయటకు రాగా, తాజాగా ఈ సినిమాలోని ఒక కీలకమైన యాక్షన్ ఎపిసోడ్‌కు సంబంధించిన విజువల్స్ లీక్ అయ్యాయి.

Read also-అరుదైన గౌరవం అందుకున్న రామ్ చరణ్.. స్పెషల్ అట్రాక్షన్ గా రైమ్!

గంగా నది తీరాన

Advertisement

లీకైన విజువల్స్ ప్రకారం.. వారణాసి ఘాట్‌ల నేపథ్యంలో ఒక భారీ యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. గంగా నదిలో స్పీడ్ బోట్లపై మహేష్ బాబు చేస్తున్న సాహసోపేతమైన ఫైట్ సీక్వెన్స్ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఈ సీన్ సినిమాలోనే అత్యంత కీలకమైన ‘ఇంటర్వెల్ బ్యాంగ్’ అని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలో వేసిన ఒక భారీ సెట్‌లో జరుగుతోంది. వారణాసి నగరాన్ని తలపించేలా సుమారు 700 అడుగుల పొడవుతో ఈ సెట్‌ను అత్యంత ఖరీదుగా నిర్మించారు. గంగా నదిలో సాగే సీన్లను కూడా ఇక్కడే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ సెట్స్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ లీకులు అక్కడి నుండే వచ్చినట్లు భావిస్తున్నారు.

ఈ సినిమా పురావస్తు శాఖకు చెందిన ఒక సాహసికుడు, పురాతన రహస్యాల కోసం చేసే ప్రయాణమే ఈ సినిమా కథ అని సమాచారం. సుమారు రూ.1,400 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం భారతీయ సినిమాలోనే అత్యంత ఖరీదైనదిగా నిలవనుంది. ఈ సినిమాను మొదటిసారిగా పూర్తి స్థాయిలో ఐమాక్స్ (IMAX) ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్నారు. మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.

Advertisement

Read also-శర్వానంద్ సిల్వర్ స్క్రీన్‌కు పొర్లుదండం పెట్టడానకి రీజన్ ఇదే..

జక్కన్న సీరియస్!

ఎంతో గోప్యంగా ఉంచుతున్న షూటింగ్ విజువల్స్ వరుసగా బయటకు వస్తుండటంతో దర్శకుడు రాజమౌళి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సెట్స్‌లో మొబైల్ ఫోన్లపై ఆంక్షలు విధించినప్పటికీ, ఈ లీకులు ఎలా జరుగుతున్నాయనే దానిపై చిత్ర యూనిట్ ఆరా తీస్తోంది. మరోవైపు, ఈ లీకైన విజువల్స్‌లో మహేష్ బాబు లుక్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఏప్రిల్ 7, 2027న విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా వేల కోట్లు పెట్టి తీస్తున్న ఈ సినిమా సీన్లు లీకవడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×