E-Paper
Advertisement

Mahesh Babu: ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది.. ఆ సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు!

Mahesh Babu: ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది.. ఆ సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు!
Advertisement

Mahesh babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వారణాసి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక మహేష్ బాబు మామూలుగానే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు . ఈయన ఏదైనా తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు లేదా తన సినిమాలకు సంబంధించిన అంశాలు గురించి మాత్రమే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పోస్టులు చేస్తుంటారు. ఇక మహేష్ బాబు ఏదైనా సినిమా చూసి ఆ సినిమా నచ్చితే కనుక కచ్చితంగా ఆ చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతుంటారు.

యుఫోరియా చాలా బాగా ఎంజాయ్ చేశా..

తాజాగా మహేష్ బాబు గుణశేఖర్(Guna sekhar) డైరెక్షన్లో భూమిక ,సారా అర్జున్ ప్రధాన పాత్రలలో నటించిన యుఫోరియా(Euphoria) సినిమా చూశారని తెలుస్తోంది. ఈ సినిమా చూసిన అనంతరం మహేష్ బాబు ఈ సినిమా పై తన అభిప్రాయాలను తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా మహేష్ బాబు స్పందిస్తూ.. యుఫోరియా ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన సినిమా అని తెలిపారు. దర్శకుడు గుణశేఖర్ గారు కథలు చెప్పే విధానంలో చాలా వైవిధ్యం ఉంటుందని తెలిపారు. యుఫోరియా చాలా బాగా ఎంజాయ్ చేశానని ముఖ్యంగా క్లైమాక్స్ అంటూ చిత్ర బృందం పై మహేష్ బాబు ప్రశంసలు కురిపిస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

సినీ ప్రియుడుగా మీరు ఇష్టపడతారని తెలుసు..

Advertisement

ఇలా గుణశేఖర్ సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు కురిపించడంతో చిత్ర బృందం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ పోస్టుపై డైరెక్టర్ గుణశేఖర్ కూడా స్పందించారు. ఈ సందర్భంగా మహేష్ బాబు పోస్ట్ కు గుణశేఖర్ రిప్లై ఇస్తూ థాంక్యూ సో మచ్ మహేష్ బాబు. ఒక సినీ ప్రియుడిగా ఈ సినిమాని మీరు ఇష్టపడతారనే విషయం నాకు తెలుసు. మీరు మా సినిమాకు ఇచ్చిన ఈ సపోర్టుకు ధన్యవాదాలు అంటూ గుణశేఖర్ మహేష్ బాబు పోస్ట్ పై స్పందిస్తూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గుణశేఖర్ ఒకానొక సమయంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక గుణశేఖర్ డైరెక్షన్లో మహేష్ బాబు భూమిక నటించిన ఒక్కడు సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ బాబు సినీ కెరియర్ లో ఒక్కడు సినిమాకి కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు గుణశేఖర్ కాంబినేషన్లో ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు రాకపోయినా ఒక్కడు తర్వాత భూమిక తాజాగా గుణశేఖర్ డైరెక్షన్లో యుఫోరియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఈ సినిమాకి మంచి రివ్యూ ఇవ్వడంతో ఈ సినిమాకు మరింత ఆదరణ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి.

Also Read; SSS Film: థియేటర్లలోనే శివాజీ సాంప్రదాయని సుప్పిని  సుద్దపూసిని రిలీజ్…ఎప్పుడంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×