E-Paper
Advertisement

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?
Advertisement

Maharaja:విజయ్ సేతుపతి మైలురాయి చిత్రం ‘మహారాజ’లో తన అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ యాక్ట్రెస్ సచనా నమీదాస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఆమెకు ఉత్తమ సహాయ నటి అవార్డు దక్కింది. జాతీయ అవార్డుల ప్రకటనను టీవీలో లైవ్‌లో చూస్తున్న సమయంలో తన పేరు వినగానే సచనా ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఈ క్యూట్ అండ్ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వివరాలు చూద్దాం..

తొలి సినిమాతోనే నేషనల్ అవార్డ్ – కల నిజమైన వేళ:

నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహారాజ’ సినిమాతోనే సచనా నమీదాస్ వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అత్యున్నతమైన జాతీయ అవార్డును అందుకోవడంపై సచనా ఆనందానికి అవధులు లేవు. “ఈ విజయం నా కల నిజమైనట్లుగా ఉంది. మా డైరెక్టర్ గారు నెల రోజుల ముందే అవార్డుల కోసం మన పేర్లు పంపామని చెప్పారు. ఏదో ఒక మూల ఆశ ఉన్నా, నిజంగానే అవార్డు వస్తుందని అస్సలు ఊహించలేదు. నా కంటే నా కవల సోదరి ఎక్కువగా ఎమోషనల్ అయి ఏడ్చేసింది. ఈ అవార్డును నా సిస్టర్‌కే అంకితం ఇస్తున్నా” అంటూ సచనా మురిసిపోయింది.

విజయ్ సేతుపతి సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది:

Advertisement

ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూతురిగా ‘జ్యోతి’ పాత్రలో సచనా నటన గుండెలను పిండేస్తుంది. సినిమా సక్సెస్‌లో ఆమె క్యారెక్టర్ చాలా కీలకం. తన మొదటి సినిమా అనుభవం గురించి చెప్తూ.. “సెట్స్‌లో విజయ్ సేతుపతి సార్ నాకు ఇచ్చిన గైడెన్స్, సలహాలు వల్లే నేను ఈ రోజు ఈ పొజిషన్‌లో ఉన్నాను. ఆయన ప్రతి సీన్‌లోనూ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. అలాగే డైరెక్టర్ నితిలన్ గారు కూడా నాకు నచ్చినట్లు నటించే ఫ్రీడమ్ ఇచ్చారు” అని సచనా తన సంతోషాన్ని పంచుకుంది.

also read:డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

బిగ్ బాస్ హవా.. తదుపరి క్రేజీ ప్రాజెక్టులు:

Advertisement

మహారాజ సినిమా ఇచ్చిన క్రేజ్‌తో సచనా ఆ తర్వాత విజయ్ సేతుపతి హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 8’ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ 63 రోజుల పాటు ఉండి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అలాగే జియో హాట్‌స్టార్ సిరీస్ ‘హార్ట్ బీట్ సీజన్ 2’ లోనూ మెరిసింది. ఇక ‘మహారాజ’ సినిమాకు గాను సచనాతో పాటు ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ అనల్ అరసు కూడా బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ కేటగిరీలో జాతీయ అవార్డును కైవసం చేసుకోవడం విశేషం.

డెబ్యూ సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకోవడం అనేది ఏ నటికైనా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్. ప్రస్తుతం సచనా నమీదాస్ రెండు క్రేజీ సినిమాల్లో నటిస్తోంది.ఇక నేషనల్ అవార్డు తెచ్చిన జోష్‌తో ఈ యంగ్ బ్యూటీ భవిష్యత్తులో మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని, మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తూ టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×