E-Paper
Advertisement

ప్రకాష్ రాజ్‌కు టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఓపెన్ ఛాలెంజ్.. చర్చకు సిద్ధమా?

ప్రకాష్ రాజ్‌కు టాలీవుడ్ ప్రొడ్యూసర్  ఓపెన్ ఛాలెంజ్.. చర్చకు సిద్ధమా?
Advertisement

Prakash Controversy : సినీ ఇండస్ట్రీలో వెర్సటైల్ యాక్టర్ గా ముద్ర వేసుకున్న ప్రకాష్ రాజ్ పాలిటిక్స్ లో మాత్రం కాంట్రవర్సీలకు కేరాఫ్ అవుతున్నాడు. అలా గత కొంతకాలంగా `#JustAsking` అంటూ BJP పైన ప్రశ్నల భాణాలను సందిస్తున్న ప్రకాష్ రాజ్ పై తాజాగా నెట్టింట్లో తెగ ఫైర్ అయ్యాడు టాలీవుడ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్. ఒకరిపై విమర్శిస్తూ దుమ్మెత్తిపోసేయడమే తప్ప, అదే విమర్శలను ఫేస్ చేయడం ప్రకాష్ రాజ్ కి చేతకాదంటూ సెన్సేషన్ కామెంట్స్ చేశాడు.

ఎక్స్ (ట్విట్టర్)లో బ్లాక్ చేయడమే

Advertisement

అయితే మధుర శ్రీధర్ రెడ్డి ప్రకాష్ రాజ్ పైకి ఇంతలా ఫైర్ అవ్వడానికి కారణం ఆయన్ని ఎక్స్ (ట్విట్టర్)లో బ్లాక్ చేయడమే. దీంతో మండిపోయిన మధుర శ్రీధర్ దాన్ని స్క్రీన్ షాట్‌తో సహా బయటపెట్టి ప్రకాష్ రాజ్‌ను ‘హేట్ మాంగర్’ అంటూ మండిపడ్డాడు.“ప్రకాష్ రాజ్ గారు, మీరు మిమ్మల్ని మీరు గొప్ప మేధావిగా, ఉదారవాదిగా భావించుకుంటారు. కానీ నిజానికి మీది చాలా సంకుచిత మనస్తత్వం.ఎదుటివారిని ప్రశ్నించడం మాత్రమే మీకు తెలుసు, ఎవరైనా మిమ్మల్ని నిలదీస్తే భయపడి బ్లాక్ చేస్తారు. మోదీని, BJPని ద్వేషించడమే పరమావధిగా పెట్టుకున్న మీరు ఒక కపట లౌకికవాది” అంటూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు మధుర శ్రీధర్.

Advertisement

కోట్ చేస్తూ ప్రకాష్ రాజ్ పై సెటైర్లు

దీనికి తోడు గతంలో పవన్ కళ్యాణ్, కోలీవుడ్ స్టార్ విజయ్‌లపై చేసిన కామెంట్స్ కోట్ చేస్తూ ప్రకాష్ రాజ్ పై సెటైర్లు వేశాడు. ముఖ్యంగా 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ “సనాతన ధర్మం” గురించి మాట్లాడినప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో చెప్పక్కర్లేదు.ఇక తమిళనాట విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ పెట్టినప్పుడు కూడా ఇన్ డైరెక్ట్ గా నెగెటివ్ కామెంట్స్ చేసుకొచ్చాడు.దీంతో వీటన్నింటిని ప్రస్తావిస్తూ ప్రకాష్ రాజ్ కి కౌంటర్ వేశాడు మధుర శ్రీధర్.

మా’ (MAA) అసోసియేషన్ ఎన్నికల్లో కూడా

ప్రజా క్షేత్రంలో ఎవరు మొనగాళ్లో ప్రజలే తేల్చారని, విమర్శించిన పవన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అని, ఇక తమిళనాట త్వరలో కాబోయే సీఎం అంటూ విజయ్ గురించి ప్రస్తావించాడు. కానీ మీరు మాత్రం కనీసం చిన్న ‘మా’ అసోసియేషన్ ఎన్నికల్లో కూడా గెలవలేకపోయారంటూ సెటైర్లు వేశాడు.ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయిన విషయాన్ని గుర్తు చేశాడు.ఇక ఇప్పటికైనా ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వెనుక దాక్కుని ట్వీట్లు వేయడం ఆపి దమ్ముంటే డైరెక్ట్‌గా చర్చకు రావాలంటూ సవాల్ విసిరాడు మధుర శ్రీధర్.

ఫేస్ టూ ఫేస్  తేల్చుకుందాం

“మోదీని, BJPని అంతగా ద్వేషిస్తున్నావు కదా.. నీ దగ్గర పాయింట్స్ ఉంటే నాతో చర్చకు రా. ఫేస్ టూ ఫేస్  తేల్చుకుందాం” అంటూ ఓపెన్‌గా ఛాలెంజ్ చేశాడు. దీంతో ఎప్పుడూ సైలెంట్‌గా, సెన్సిబుల్‌గా ఉండే మధుర శ్రీధర్ ఇలా ఒక్కసారిగా ఫైర్ అవ్వడం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.మధుర శ్రీధర్ రెడ్డి విషయానికి వస్తే ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’, ‘దొరసాని’ వంటి సినిమాలకు నిర్మాతగానే కాకుండా ‘స్నేహ గీతం’ (2010), ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’ (2011) వంటి సినిమాలతో దర్శకుడిగా కూడా మంచి పేరే తెచ్చుకున్నాడు.చూడాలి మరి మధుర శ్రీధర్ సందించిన ఈ సవాల్ కి ప్రకాష్ రాజ్ ఎలా రియాక్ట్ అవుతాడో!

ALSO READ :బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ ఊచకోత.. రిలీజ్‌కు ముందే

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×