// // GlobeTrotter Event : గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో అంతా పోకిరి నామస్మరణ, పూరి ఇది చూడవయ్యా - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

GlobeTrotter Event : గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో అంతా పోకిరి నామస్మరణ, పూరి ఇది చూడవయ్యా

GlobeTrotter Event : గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో అంతా పోకిరి నామస్మరణ, పూరి ఇది చూడవయ్యా
Advertisement

GlobeTrotter Event : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు మధ్య విపరీతమైన పోటీ నెలకొనేది. ఇప్పుడంతా అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ అని అనుకుంటున్నారు కానీ ఒకప్పుడు అసలైన పోటీ అంటే మాత్రం మహేష్ బాబు పవన్ కళ్యాణ్ మధ్య జరిగేది. ఇద్దరు కూడా పోటాపోటీగా సినిమాలు చేసేవాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడం తగ్గించేశారు.

మరోవైపు మహేష్ బాబు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిపోయారు. మొదటిసారి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు మహేష్. మహేష్ బాబు కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. వాటిలో పోకిరి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ పోకిరి సినిమా. ఇప్పటికీ కూడా పోకిరి సినిమా చూస్తే ఇంత గొప్ప సినిమా పూరి ఎలా తీశాడు అనే డౌట్ వస్తుంది.

అంతా పోకిరి నామస్మరణ 

Advertisement

అతని పూరి జగన్నాథ్ గురించి గతంలో రాజమౌళి ఎంతో గొప్పగా మాట్లాడారు. చాలామందికి హీరో క్యారెక్టర్ ట్రైజేషన్ క్రియేట్ చేశాడు అంటూ ఆకాశానికి ఎత్తేశారు. మరోవైపు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ పూరి జగన్నాథ్ కు వీర అభిమాని అని తెలిసిన విషయమే.

ఇకపోతే మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వారణాసి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ ఈవెంట్ లో దేవకట్ట ఫేవరెట్ డైలాగ్ ఏంటి అని అడిగినప్పుడు పోకిరి సినిమా డైలాగ్ చెప్పారు.

కీరవాణి మాటల్లో 

Advertisement

ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమా అంటే ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడుగా ఫిక్స్. అయితే నేను ఒక ఫ్లాట్ కొన్నాను. ఆ ఫ్లాట్ గృహప్రవేశం 2027లో జరుగుతుంది అని కీరవాని చెప్పారు.

పోకిరి సినిమాలో ఆశీష్ విద్యార్థి మరియు మహేష్ బాబు మధ్య జరిగే జరిగే డైలాగ్స్ ను కీరవాణి తన మాటల్లో చెప్పారు. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసేసాడా, పద్మావతి హ్యాపీయేనా, ఎప్పుడు ఇస్తున్నావ్ రివాల్వర్ అనే మహేష్ బాబు డైలాగులను మారుస్తూ చెప్పారు కీరవాణి.

మొత్తానికి కీరవాణి మహేష్ బాబు డైలాగులు చెప్పడం, అలానే పూరి జగన్నాథ్ కి విజయేంద్రప్రసాద్ అభిమాని అని కొన్ని సందర్భాల్లో చెప్పడం, పూరికి రాజమౌళి ఎలివేషన్ ఇవ్వడం, ఇప్పుడు దేవకట్ట పోకిరి సినిమా డైలాగ్ చెప్పటం అంతా పోకిరి నామస్మరణ అయిపోయింది. కనీసం ఇది చూసి పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తాడు అని చాలామంది పూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Also Read: GlobeTrotter Event : 15 సంవత్సరాల క్రితం ప్రాజెక్టు ఇప్పుడు పట్టాలెక్కింది, నిర్మాత ఎమోషనల్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×